నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్
సినిమాల్లో కాంట్రవర్సీలు అనేవి సహజం. ప్రతీ సినిమాలో ప్రేక్షకుల్లో ఎవరో ఒకరిని హర్ట్ చేసే అంశం ఏదో ఒకటి ఉంటుంది. అవే వివాదాలకు దారితీస్తాయి. తాజాగా నయనతార హీరోయిన్‌గా నటించిన ‘అన్నపూర్ణి’ చిత్రంలో కూడా అలాంటి కాంట్రవర్సీలకు దారితీసే అంశాలే ఉన్నాయని.. ఈ సినిమాను బ్యాన్ చేయాలని వివాదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ‘అన్నపూర్ణి’లో బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచే అంశాలు ఉన్నాయని కొందరు ప్రేక్షకుల వాదన. దీంతో నయనతారతో పాటు ఇతర మూవీ టీమ్ కూడా చిక్కుల్లో పడింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?
డిసెంబర్ నెలలో థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీల్లో కూడా సినిమా సందడి మొదలయ్యింది. ఈవారంతో పాటు వచ్చేవారం కూడా పలు చిత్రాలు ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. అందులో తమిళ హీరో కార్తీ నటించిన ‘జపాన్’ కూడా ఒకటి. ఎన్నో అంచనాలతో థియేటర్లలో విడుదలయిన ‘జపాన్’.. ఆశించినంత విజయం అందుకోలేదు. దీంతో నెలరోజుల్లోనే ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యింది. అసలు ఈ మూవీ ఏ ఓటీటీలో విడుదల అవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయాలను మూవీ టీమ్ తాజాగా బయటపెట్టింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ
'సంతోషం' మ్యాగజైన్ అధినేత, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి ప్రతీ ఏడాది సంతోషం అనే పేరుతో అవార్డులను నటీనటులకు అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 2న అవార్డులు ప్రదానం చేశారు. అయితే ఈ అవార్డుల ఫంక్షన్‌లో పలువురు కన్నడ సెలబ్రిటీలకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండగా.. దీనిపై సురేష్ కొండేటి ఎట్టకేలకు స్పందించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
సంక్రాంతి విడుదల కానున్న సినిమాలు కూడా డిసెంబర్‌లో ప్రమోషన్స్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ముందుగా గ్లింప్స్, ఆ తర్వాత పాటలు విడుదల చేసి సినిమాలపై హైప్ పెంచాలని మూవీ టీమ్స్ ప్లాన్ చేస్తున్నాయి. ఆ లిస్ట్‌లో సీనియర్ హీరో నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ కూడా యాడ్ అయ్యింది. ఇప్పటివరకు ఈ మూవీలో నాగార్జున లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేస్తూ మొదటి అప్డేట్ వచ్చింది. దాని తర్వాత ‘నా సామిరంగ’ నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఇక తాజాగా ఈ మూవీలో హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ కూడా ఇచ్చేసింది మూవీ టీమ్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


అది ఆయన ఫెయిల్యూర్, మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు: ‘సంతోషం’ వివాదంపై అల్లు అరవింద్ కామెంట్స్
గోవాలో జరిగిన సంతోషం మూవీ అవార్డ్స్ (Santosham Awards) వివాదంపై అల్లు అరవింద్ స్పందించారు. ఆ అవార్డుల వేడుకను నిర్వహించిన సురేష్ కొండేటి.. మెగాస్టార్ కుటుంబానికి పీఆర్ అని పలు వార్తాసంస్థలు పేర్కోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తమ కుటుంబంలో ఎవరికీ ఆయన పీఆర్ కాదని స్పష్టం చేశారు. సంతోషం అవార్డ్స్ ఫెయిల్యూర్‌ను తమకు ఆపాదించవద్దని మీడియాను కోరుకున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)