'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా?
'సలార్' ట్రైలర్ విడుదలైంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అంతగా నచ్చలేదు. వాళ్ళ అంచనాలను ట్రైలర్ 100 పర్సెంట్ అందుకోలేదు. సామాన్య ప్రేక్షకుల నుంచి సైతం మిశ్రమ స్పందన లభిస్తోంది. అవన్నీ పక్కన పెడితే... 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత మరోసారి కన్నడ సినిమా 'ఉగ్రం' పేరు తెరపైకి వస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బాక్సాఫీస్ దగ్గర ‘యానిమల్’ రోరింగ్, రణబీర్ కెరీర్‏లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్, ఎన్ని కోట్ల వసూళ్లంటే?
టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ‘యానిమల్‘ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్‌ తోనే అదుర్స్ అనిపించిన ‘యానిమల్‘ మూవీ, తొలి రోజు ఈజీగా వంద కోట్ల మార్కును దాటింది. రణబీర్ కెరీర్‏లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న మూవీగా నిలిచింది. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 116 కోట్లు వసూళు చేసింది. భారత్ లోనే  దాదాపు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘యానిమల్’ మూవీ హిందీలో రూ.50 కోట్లు, తెలుగులో రూ.10 కోట్లు, కన్నడ, తమిళ్, మలయాళంలో... ఓవర్సీస్ మార్కెట్ కూడా కలిపితే మొత్తంగా మరో రూ. 60 కోట్లకు పైగా నెట్‌ కలెక్షన్లు అందుకున్నట్లు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


లోక్‌సభ ఎన్నికల్లో కంగనా రనౌత్‌ పోటీ చేస్తుందా? వైరలైన పోస్టర్‌, మరి అసలు నిజం ఏమిటి?
సినీ నటులు చాలా మంది రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్ట సభల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజా సమస్య పరిష్కారం కోసం పార్లమెంట్, అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. కంగనా కూడా తన రాజకీయ అరంగేట్రంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజుల క్రితం ద్వారక శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన ఆమె, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు వెల్లడించింది. శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటే, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పింది. ఈ ప్రకటనతో ఆమె రాజకీయాల్లోకి రావడం ఖాయం అనే వార్తలు వినిపించాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ
సిల్క్ స్మిత... ఈ పేరు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లి పాతిక సంవత్సరాలు దాటింది. అయినా సరే ఆమెను ఎవరూ మరువలేదు. పాటల్లో, ఏదో ఒక సినిమాలో సిల్క్ స్మిత ప్రస్తావన తప్పకుండా ఉంటోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆమె జీవితంపై ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ
'హాయ్ నాన్న' సినిమాలో ప్రధాన బలం ఎమోషన్ అని చెప్పారు దర్శకుడు శౌర్యువ్. తండ్రి కూతురు మధ్య అనుబంధం,  మృణాల్ పాత్రలో వున్న బాండింగ్  ఆకట్టుకుంటుందన్నారు. ఎమోషన్ కారణంగానే నాని ఈ కథని ఒప్పుకున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రానికి ‘సంతోషం’ సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్నారు.  సింగిల్ ఫాదర్ మళ్ళీ ప్రేమలో పడ్డాడనగానే  చాలా సినిమాలు గుర్తుకు వస్తాయన్నారు. ‘హాయ్ నాన్న’ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా వుంటుందన్నారు.  జీవితంలో, సమాజంలోని చాలా అంశాలు ఈ సినిమాలో కనిపిస్తాయన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)