Animal 1st Day Collections: టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ‘యానిమల్‘ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా వచ్చిన ఈ మూవీ తొలి రోజు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది.
బాక్సాఫీస్ ను షేర్ చేసిన ‘యానిమల్’
అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అదుర్స్ అనిపించిన ‘యానిమల్‘ మూవీ, తొలి రోజు ఈజీగా వంద కోట్ల మార్కును దాటింది. రణబీర్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న మూవీగా నిలిచింది. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 116 కోట్లు వసూళు చేసింది. భారత్ లోనే దాదాపు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘యానిమల్’ మూవీ హిందీలో రూ.50 కోట్లు, తెలుగులో రూ.10 కోట్లు, కన్నడ, తమిళ్, మలయాళంలో... ఓవర్సీస్ మార్కెట్ కూడా కలిపితే మొత్తంగా మరో రూ. 60 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ‘యానిమల్’ మూవీని మేకర్స్ రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. రూ.210 కోట్ల టార్గెట్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ‘యానిమల్’ జోరు చూస్తుంటే రూ.210 కోట్ల బ్రేక్ ఈవెన్ ను ఈ వీకెండ్ లో ఈజీగా దాటేసే అవకాశం కనిపిస్తోంది. నిర్మాతలకు మంచి లాభాలను అందించబోతోంది.
‘కబీర్ సింగ్’ రికార్డులు బద్దలు!
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ మూవీ తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేశారు. హిందీలో ‘కబీర్ సింగ్’ రూపొందించిన ఐదేళ్ల తర్వాత ‘యానిమల్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కబీర్ సింగ్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లు వసూళు చేసింది. ‘యానిమల్’ మూవీతో ఆ సినిమా రికార్డులు బద్దలు కానున్నాయి. మరోవైపు సందీప్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. సందీప్ మాత్రం తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ తో చేయనున్నారు. ‘స్పిరిట్’ పేరుతో రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో షూటింగ్ జరుపుకోనుంది. 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ‘రణబీర్’ ‘యానిమల్’తో బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి, ప్రభాస్ మూవీతో ఇంకా ఏ రేంజి హిట్ అందుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అటు ‘యానిమల్’ మూవీ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్, బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.
Read Also: ఒక్క సీన్, రెండు రాత్రలు - అతడి కోసం తప్పలేదన్న రాధికా ఆప్టే!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply