Gruhalakshmi Telugu Serial Today Episode: నందగోపాల్ విషయంలో తులసి బాధపడుతుంటే వాళ్ల అత్తయ్య మామలు ఇద్దరూ వచ్చి ఇలా బాధపడటం కంటే నందగోపాల్‌ను ఇంట్లోంచి పంపించేయడం బెటర్ అంటూ సలహా ఇస్తారు. లేదంటే నందగోపాల్‌తో నువ్వు మాట్లాడితే వాడు మారుతాడని చెప్తారు. నాకు ఆయన మీద కోపం లేదని అలాగని నేను ఆయన్ను నమ్మలేనని చెప్తుంది తులసి. మరోసారి నందాను నమ్మి మోసపోవడం ఇష్టం లేదని ఇప్పుడు నేను బతుకుతుంది హని కోసమని తులసి చెప్పి వెళ్లిపోతుంది. లాస్య గార్డెన్‌లో ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. ఇంతలో భాగ్య టీ తీసుకుని వచ్చి లాస్యకు ఇచ్చి
భాగ్య: ఏంటి తెగ ఆలోచిస్తున్నావ్..
లాస్య: తెలివిగా ఆలోచించి ప్లాన్ వేసే మగాణ్ణి చాణక్యుడు అంటారు. మరి ఆడదాన్ని ఏమంటారు.
భాగ్య: చాణిక్యి అనాలా? లేడీ చాణిక్యుడు అనాలా?
లాస్య: ఇది బాగుంది కన్‌ఫమ్ చేసుకో..
భాగ్య: ఎవరికీ?
లాస్య: నాకే..ఇప్పుడు నేను లేడీ చాణిక్యుడిలా ఆలోచిస్తున్నాను. తులసి దృష్టిలో నందు దిగజారిపోయి ఎప్పటికీ వారిద్దరు ఒకటి కాని పరిస్థితి క్రియేట్ చేస్తాను.
భాగ్య: దానివల్ల నీకు లాభం ఏంటో?
అని భాగ్యం అడగ్గానే నందకు ఆ ఇంట్లో చోటు లేకుండా చేస్తే.. నా ఇంట్లోకి నా ఓదార్పు కోసం వస్తాడు అని చెప్తుంది లాస్య. ఒకసారి నీ చేతిలో మోసపోయిన వ్యక్తి మళ్లీ నీ దగ్గరకు ఎలా వస్తాడని అడుగుతుంది భాగ్యం. తన ప్లాన్ మొత్తం భాగ్యంకు చెబుతుంది లాస్య. నీ ప్లాన్ బాగుంది, సూపర్ అంటూ పొగుడుతుంది భాగ్యం.
విక్రమ్ వాళ్ల ఇంట్లో బసవయ్యా, ప్రసూనాంబ, సంజయ్ ఇంటి పనులు చేస్తుంటారు. మామయ్య మా అమ్మకు చెప్తే మనకీ బాధలు తప్పవు కదా అని అడుగుతే మీ అమ్మకు అంత పవర్ లేదు. రేపో మాపో మీ అమ్మ కూడా మన స్టేజీకి రావడం ఖాయం అంటాడు బసవయ్య. ఆలోచిస్తూ కూర్చున్న రాజ్యలక్ష్మీని చూసి విక్రమ్ ఎంటమ్మా బాధగా కూర్చున్నావు అని అడుగుతాడు.
రాజ్యలక్ష్మీ: సంజయ్‌ని కాపాడమని నిన్ను అడిగి తప్పు చేశాను. వాడు జైల్లో ఉన్నా బాగుండేదేమో.. నా ముందు పనోడిలా అడ్డమైన పనులు చేస్తుంటే చూడలేకపోతున్నాను. నా మనసు మార్చుకుంటానురా వాడిని జైలుకు పంపించు
విక్రమ్: నాకు మాత్రం తమ్ముడంటే ప్రేమ లేదా అమ్మా..
రాజ్యలక్ష్మీ: వాణ్ణి పనివాణ్ని చేయడం ప్రేమా అంటారా?
అని రాజ్యలక్ష్మీ ఏడుస్తూ ప్రశ్నించడంతో.. విక్రమ్ కూడా బాధగా అమ్మ ఈ ఇంట్లో తమ్ముడికి అన్యాయం జరగదు. నేనున్నాను నన్ను నమ్ము అంటూ భరోసా ఇస్తాడు విక్రమ్. వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం దూరం నుంచి దివ్య వింటుంది.
మరోవైపు పరంధామయ్య, అనసూయలు పాయిజన్ బాటిల్ టీపాయ్ మీద పెట్టుకుని కూర్చుని ఉంటారు. ఇంతలో నందా అక్కడకు వచ్చి..పాయిజన్ బాటిల్ తీసుకుని తాగబోతుంటే.. అనసూయ, పరంధామయ్యలు బాటిల్ విసిరేసి..
అనసూయ: ఎంట్రా నువ్వు చేస్తున్న పని
నందా: మీరు చేయాలనుకున్న పని నేను చేస్తున్నాను.. తప్పులు చేస్తుంది నేను.. మీ అందరిని బాధపెడుతుంది నేను.. మనసు వ్యక్తిత్వం లేని వాణ్ని నేను. ఒక తాగుబోతు వెధవను నేను. అలాంటప్పుడు చావాల్సింది నేను. మీరు కాదు. నేను పోతే మీకందరికి ప్రశాంతంగా ఉంటుంది. నేను చేసిన తప్పులకు శిక్ష కూడా పడినట్లు ఉంటుంది.
అనగానే నిన్ను మారమని మేం అడిగాం కానీ చనిపోమని అడగలేదు కదా అంటారు అనసూయ, పరంధామయ్య. నేను ఎంత మారినా తులసి నన్ను అర్థం చేసుకోవడం లేదని నంద బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. విక్రమ్ గార్డెన్‌లో నిలబడి రాజ్యలక్ష్మీ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో దివ్య అక్కడికి వస్తుంది.
దివ్య: ఎంటి సార్ ఆలోచిస్తున్నారు. నా గురించా?
విక్రమ్: కాదు.. అమ్మ గురించి.. మనసులో ఇంత బాధ దాచుకుంది అనుకోలేదు. ఇంతలా వేదన భరిస్తుంది అనుకోలేదు.
అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా దివ్య కళ్లు తిరిగి కింద పడిపోతుంది. విక్రమ్ కంగారుగా దివ్యను ఎత్తుకుని పరుగెడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ అయిపోతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply