Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7కు ఇప్పటికీ ఉల్టా పుల్టా అనే ట్యాగ్ ఇచ్చారు. ఇక ఆ ట్యాగ్‌కు న్యాయం చేస్తూ.. బిగ్ బాస్ ఎప్పటికప్పుడు కంటెస్టెంట్స్‌ను మాత్రమే కాదు.. ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో అలాంటిదే జరిగింది. ఫినాలే అస్త్రా రేసులో ఉన్న కంటెస్టెంట్స్.. టాస్క్ ఆడడం పూర్తయిన తర్వాత శోభా అక్కడికి వెళ్లి.. టాస్క్ కోసం ఏర్పాటు చేసిన ప్రాపర్టీని కదిలించింది. దీంతో బిగ్ బాస్ తనకు పనిష్మెంట్ ఇస్తానని కంటెస్టెంట్స్ అందరినీ లివింగ్ రూమ్‌లోకి పిలిచారు. అందరూ పనిష్మెంట్ ఏంటా అని భయపడుతున్న సమయానికి నిద్రపోవడానికి సమయం ఇస్తున్నట్టు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌తో తమ ప్రేమకథలు వినిపించారు.
శివాజీ ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీ..
బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ అంతా సాయంత్రం సమయంలో గంటపాటు నిద్రపోయే అవకాశం ఇవ్వడం మాత్రమే కాకుండా.. వారు లేచే సమయానికి ఛాయ్‌ను ఏర్పాటు చేశారు. వారంతా ఛాయ్ చుట్టూ కూర్చొని వారి ప్రేమ కహానీలు చెప్పుకున్నారు. ముందుగా శివాజీ ప్రేమకథనే చెప్పాలని అందరూ కోరగా.. తను కూడా ఒప్పుకొని ప్రేమకథను మొదలుపెట్టాడు. వెల్‌కమ్ టు శివాజీ లవ్ స్టోరీ అంటూ ప్రారంభించాడు. ‘‘మాస్టర్ సినిమా అయిపోయింది. ఒక పెద్దాయన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది. ఆరోజు కలిశాను ఫస్ట్ టైమ్ నా భార్యను. అదే మా లవ్ స్టోరీలో మొదటి రోజు. అప్పటికే మనం సెలబ్రిటీ. ఒక ఏడాదిపాటు నడిచింది. రోజూ చిక్కడపల్లిలో తను ట్యూషన్‌కు వెళ్లేటప్పుడు కలిసేవాడిని. డిగ్రీ పూర్తయ్యక చివరి సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను. లవ్ స్టోరీ ఇప్పటికీ నడుస్తుంది’’ అంటూ పూర్తిచేశాడు.
శోభా, గౌతమ్‌ల రొటీన్ స్టోరీ..
ఆ తర్వాత శోభా టర్న్ వచ్చింది. ‘‘లాక్‌డైన్ కంటే ముందు ఆ అబ్బాయిను ఒక షూటింగ్‌లో కలిశాను. లాక్‌డౌన్ టైమ్‌లో సోషల్ మీడియాలో తన దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చింది. తనే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రిప్లై ఇచ్చాను. వీడియో కాల్స్ మాట్లాడుకున్నాం. ఆ టైమ్‌లో ఖాళీగా ఉండడం వల్ల కాల్స్, మెసేజ్‌లు ఎక్కవగా జరిగాయి. కనెక్ట్ అయిపోయాను. మంచోడు అనిపించింది. నేనే ప్రపోజ్ చేశాను. పెళ్లి చేసుకుంటావా అని సింపుల్‌గా అడిగేశాను. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాను’’ అని బయటపెట్టింది శోభా. తన తర్వాత గౌతమ్.. ఒక రొటీన్ లవ్ స్టోరీ వినిపించాడు. కాలేజ్ చదువుతున్న రోజుల్లో తనకు ఒక అమ్మాయి పరిచయం అయ్యిందని, తనకోసం సినిమా కెరీర్ కూడా వదిలేసుకోవడానికి సిద్ధమయ్యి.. ఇంట్లో వాళ్లని పెళ్లికి ఒప్పించానని చెప్పుకొచ్చాడు. కానీ పలు కారణాల వల్ల, ఇంట్లో వాళ్ల ఒత్తిడి వల్ల అమ్మాయి ధైర్యం చేయలేకపోయింది. విడిపోయాం అని చెప్పి చివర్లో తను సింగిల్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు గౌతమ్.
అర్జున్, అమర్‌ల సింపుల్ లవ్ స్టోరీ..
అర్జున్, అమర్‌దీప్‌ల లవ్ స్టోరీ కూడా సింపుల్‌గా మొదలయ్యింది. ముందుగా అమర్‌దీప్ కాలేజీ చదివే రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని కానీ వర్కవుట్ అవ్వలేదని, అదే సమయంలో తనకు సీరియల్ ఆఫర్ వచ్చి అదే సెట్‌లో తేజస్వినిని కలిశానని చెప్పాడు. చాలా సమయాల్లో సపోర్ట్ చేసిందని, పెళ్లి తర్వాత తనకు బాగా అర్థం చేసుకున్నానని అన్నాడు. ఆ తర్వాత అర్జున్ ప్రారంభించాడు. ఒక రెస్టారెంట్‌లో తనను మొదటిసారి చూశానని, తన ఫ్రెండ్‌ను అడిగి నెంబర్ తీసుకున్నానని చెప్పాడు. అయితే ఆ నెంబర్ అడిగిన ఫ్రెండ్‌కే అర్జున్‌పై క్రష్ ఉండేదని బయటపెట్టాడు.
పల్లవి ప్రశాంత్ ‘బేబీ’ ప్రేమకథ..
ఇక ఫైనల్‌గా పల్లవి ప్రశాంత్ టర్న్ వచ్చింది. ప్రేమకథ చెప్పమని అడగగా ముందుగా ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్, చెప్పను అని కూడా అన్నాడు. కానీ కంటెస్టెంట్స్ అంతా తన మాట వినకుండా చెప్పమని బలవంతపెట్టారు. దీంతో చిన్నప్పుడు తనను ఎవరో అద్దంలో మొహం చూసుకోడా, ఎలా ఉంటాడని వెటకారంగా అనేవాళ్లను అందుకే తను అమ్మాయిల జోలికి వెళ్లలేదని అన్నాడు. కానీ పెద్దయ్యాక ఒకరోజు తను స్టైల్‌గా ట్రాక్టర్ మీద వెళ్తుంటే ఒక అమ్మాయి చూసిందని, ఆ తర్వాత తనకు మెసేజ్ చేసిందని మొదలుపెట్టాడు. మెసేజ్ చేసినా కూడా తనేవరో చెప్పకుండా ఉండడంతో బ్లాక్ చేస్తానని బెదిరించాడట ప్రశాంత్. దాంతో తనెవరో ఒప్పుకుందట. అప్పుడే ఆ అమ్మాయి తన మరదలని ప్రశాంత్‌కు తెలిసిందని చెప్పాడు. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్యలో ఆ అమ్మాయి ఫ్రెండ్ అనేవాడు వచ్చాడని, వాడి వల్ల ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ‘బేబీ’ లాంటి ప్రేమకథను వినిపించాడు పల్లవి ప్రశాంత్.
Also Read: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply