Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫినాలే అస్త్రా గెలుచుకోవడానికి ముగ్గురు కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. వారే అమర్‌దీప్, అర్జున్, పల్లవి ప్రశాంత్. ఈ ముగ్గురు ఫినాలే అస్త్రా సాధించుకోవడానికి కేవలం రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉన్నారు. ఇప్పటికే అమర్‌దీప్, ప్రశాంత్‌లకు రేసు నుంచి తప్పుకున్న కంటెస్టెంట్స్.. తమ పాయింట్లను ఇచ్చి సాయంగా నిలబడ్డారు. కానీ అర్జున్ మాత్రం ముందు నుంచి టాస్కులలో కష్టపడి ఆడి గెలుచుకున్న పాయింట్స్‌తోనే ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఈ ముగ్గురి మధ్య మరో రెండు టాస్కులు జరిగినట్టు తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
ఆటలో అర్జున్ డామినేషన్..
‘‘ఫినాలే అస్త్రా రేసులో మిగిలిన మీ ముగ్గురి కోసం బిగ్ బాస్ ఇస్తున్న 11వ ఛాలెంజ్ పట్టువదలకురా డింబకా. ఈ టాస్కులో అర్జున్, ప్రశాంత్, అమర్‌దీప్.. ఈ ముగ్గురికి కలిపి ఒకే బెల్ట్ వేసి ఉంటుంది. వీరు ఆ బెల్ట్‌తో పాటు మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్‌ను లాగుకుంటూ వెళ్లి కింద పడి ఉన్న ఫ్లాగ్స్‌ను కలెక్ట్ చేసి వారి ఫోటోలు ఉన్న బుట్టలో వేయాలి. అమర్, ప్రశాంత్ కంటే అర్జున్ కాస్త బలంగా ఉండడంతో తన బుట్టలోనే ఎక్కువ ఫ్లాగ్స్ పడినట్టు ప్రోమోలో చూపించారు. అయితే వారిద్దరూ కలిసి అర్జున్‌ను ఫ్లాగ్స్ వేయకుండా అడ్డుకోవాలని ప్లాన్ చేశారు. అది చేసిన శివాజీ.. ‘‘మీ ఇద్దరినీ లాగేస్తాడు’’ అంటూ నవ్వుతూ చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. అంతలో బజర్ మోగింది. సరిగా ఆడలేకపోయినందుకు పల్లవి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అర్జున్, అమర్‌కంటే తనకే తక్కువ పాయింట్లు ఉండడంతో ఫినాలే అస్త్రా రేసు నుంచి తప్పుకున్నాడు.
పాముతో చెలగాటం..
‘‘ఫినాలే అస్త్రా సాధించేందుకు బిగ్ బాస్ ఇస్తున్న ఫైనల్ బ్యాటిక్ పాముతో చెలగాటం’’ అని బిగ్ బాస్ ప్రకటించారు. ఈ టాస్క్ కోసం రెండు పాము బొమ్మలు ఏర్పాటు చేసుంటాయి. ఆ పాము ఆకారం నుంచి బాల్‌ను తాడుతో లాగుతూ పైకి తీసుకెళ్లి పాము నోటిలో ఆ బాల్‌నే వేయాలి. ఇది కూడా ఒక విధమైన పజిల్‌లాంటిదే అని చూస్తే అర్థమవుతోంది. ప్రత్యర్థికంటే ముందుగా ఎవరైతే మూడు బాల్స్ పాము నోటిలో కరెక్ట్‌గా పడేలా చేస్తారో వారే ఈ టాస్క్‌లో విజేతలుగా నిలుస్తారు. ఈ టాస్కులో అమర్‌దీప్, అర్జున్ చాలా శ్రద్ధగా ఆడారు. కానీ విన్నర్ ఎవరో ప్రోమోలో తెలియలేదు.
అర్జునే విన్నర్..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం అర్జునే ఫినాలే అస్త్రా గెలుచుకున్న విన్నర్ అని తెలుస్తోంది. ఫినాలే అస్త్రా కోసం బిగ్ బాస్ ఇచ్చిన ప్రతీ ఛాలెంజ్‌లో దాదాపు అర్జున్‌కే ఎక్కువ పాయింట్లు లభించాయి. కానీ అమర్‌దీప్‌కు కంటెస్టెంట్స్‌లో ఎక్కువ సపోర్ట్ ఉండడంతో తను మొదటి నుంచి పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు. యావర్.. ప్రశాంత్‌కు, ప్రియాంక.. గౌతమ్‌కు తమ పాయింట్లను త్యాగం చేసినా వారు టాస్కుల్లో ఎక్కువ పాయింట్లు సాధించకపోవడంతో రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ అర్జున్‌కు మాత్రం ఏ సపోర్ట్ లేకపోయినా ఫినాలే అస్త్రాను గెలుచుకున్నందుకు ప్రేక్షకులు తనను అభినందిస్తున్నారు.
Also Read: తప్పు చేసిన శోభా - తనతో పాటు కంటెస్టెంట్స్ అందరికీ ‘బిగ్ బాస్’ పనిష్మెంట్, ఇదేం ట్విస్ట్?
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply