ముగిసిన ఫినాలే అస్త్రా టాస్క్ - ఒంటరి పోరాటం చేసిన ఆ కంటెస్టెంట్‌కే టికెట్, పాపం అమర్!


బిగ్ బాస్ రియాలిటీ షోలో టికెట్ టు ఫినాలే అనేది చాలా కీలకం. ఇంకా ఫైనల్స్‌కు రెండు వారాలు ఉంది అన్నప్పుడు ఈ టికెట్ టు ఫినాలే పోటీ మొదలవుతుంది. ఈ టికెట్ సాధించినవారు ఆ తర్వాత జరిగే ఎలిమినేషన్స్‌ను, నామినేషన్స్‌ను తప్పించుకొని నేరుగా ఫైనల్స్‌కు వెళ్లిపోతారు. అందుకే బిగ్ బాస్ సీజన్ 7లో కూడా ఫినాలే అస్త్రా కోసం కంటెస్టెంట్స్ అంతా తెగ పోటీపడుతున్నారు. టాస్కుల్లో చురుగ్గా ఆడలేని వారంతా ఒక్కొక్కరుగా ఫినాలే అస్త్రా రేసు నుంచి తప్పుకుంటూ వెళ్లిపోయారు. చివరిగా అర్జున్‌, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్.. ఈ రేసులో మిగిలారు. అయితే వీరిలో విన్నర్ అర్జున్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ - ఎప్పటికైనా సినిమా చేసి తీరుతా, మెహర్ రమేష్ షాకింగ్ కామెంట్స్!


టాలీవుడ్ ప్లాప్ చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా చేసిన కామెంట్స్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్‌గా మారుతున్నాయి. టాలీవుడ్‌లో తమ సినిమాలతో డైరెక్టర్ గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఫిలిం మేకర్స్ మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా ఒకరిని చెప్పొచ్చు. కెరియర్ స్టార్టింగ్ లో ఈయన తెరకెక్కించిన 'బిల్లా' మూవీకి సపరేట్ క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాలో ప్రభాస్‌ను చూపించిన విధానం, మెహర్ రమేష్ టేకింగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్ - కారణం అదేనా?


గురువారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు వేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, నమ్రత, విజయ్ దేవరకొండ, నితిన్, విక్టరీ వెంకటేష్, రాజమౌళి, నాగార్జున, నాగచైతన్య, రవితేజ, కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, నాని, విశ్వక్ సేన్, నిఖిల్ తమ ఓటు హక్కును హైదరాబాద్ జూబ్లీహిల్స్ చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ సెంటర్స్ లో వినియోగించుకున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?


యానిమల్' సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజ్ నెలకొనడానికి కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా! తెలుగులో ఆయన తీసిన 'అర్జున్ రెడ్డి' సినిమా! సందీప్ రెడ్డి వంగాకు రణబీర్ కపూర్ లాంటి టాలెంటెడ్ హీరో తోడు కావడంతో సినిమాపై ముందు నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?


దర్శకుడు విక్రమ్ కె కుమార్ శైలి వేరు. '13బి', 'ఇష్క్', 'మనం', '24' వంటి మెమరబుల్ ఫిల్మ్స్ ఇచ్చారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'దూత'. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించడం మరో స్పెషాలిటీ. '13బి' తర్వాత సూపర్ నేచురల్ జానర్ మరోసారి టచ్ చేశారు విక్రమ్ కె కుమార్. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఆయన తీసిన 'దూత' ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply