Bigg Boss Telugu 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో టికెట్ టు ఫినాలే అనేది చాలా కీలకం. ఇంకా ఫైనల్స్‌కు రెండు వారాలు ఉంది అన్నప్పుడు ఈ టికెట్ టు ఫినాలే పోటీ మొదలవుతుంది. ఈ టికెట్ సాధించినవారు ఆ తర్వాత జరిగే ఎలిమినేషన్స్‌ను, నామినేషన్స్‌ను తప్పించుకొని నేరుగా ఫైనల్స్‌కు వెళ్లిపోతారు. అందుకే బిగ్ బాస్ సీజన్ 7లో కూడా ఫినాలే అస్త్రా కోసం కంటెస్టెంట్స్ అంతా తెగ పోటీపడుతున్నారు. టాస్కుల్లో చురుగ్గా ఆడలేని వారంతా ఒక్కొక్కరుగా ఫినాలే అస్త్రా రేసు నుంచి తప్పుకుంటూ వెళ్లిపోయారు. చివరిగా అర్జున్‌, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్.. ఈ రేసులో మిగిలారు. అయితే వీరిలో విన్నర్ అర్జున్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


అదే మైనస్..
బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంటర్ అయ్యాడు అర్జున్. అయితే హౌజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తన ఆట మీదే దృష్టిపెట్టాడు. ఏ బ్యాచ్‌తో ఎక్కువగా కలవకుండా, ఫ్రెండ్‌షిప్స్, ఎమోషన్స్ లాంటివి పెట్టుకోకుండా తన ఆటపైనే ఫుల్ ఫోకస్‌తో ఉన్నాడు. అందుకే అర్జున్ ఆటతీరు చాలామంది ప్రేక్షకులకు కూడా నచ్చింది. ఫ్రెండ్‌షిప్స్‌లాంటివి పెట్టుకోకపోవడం అనేది ఈ కంటెస్టెంట్‌కు చాలావరకు మైనస్ అయినా కూడా తన తీరును మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ముఖ్యంగా ఎవరితో ఎక్కువగా బాండింగ్ పెట్టుకోకపోవడం వల్ల ఫినాలే అస్త్రాలో తనుకు చాలా మైనస్ అయ్యింది. అయినా అందరికీ దాటుకుంటూ తానే అస్త్రాన్ని గెలుచుకోవడం తన ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తోంది.


అమర్‌కు కలిసొచ్చిన పాయింట్లు..
ఫినాలే అస్త్రా కోసం పోటీ మొదలయిన తర్వాత రెండు టాస్కులు పూర్తవ్వగానే శివాజీ, శోభా శెట్టి.. పాయింట్స్ టేబుల్‌లో చివర్లో ఉన్నారు. దీంతో వారిద్దరూ కలిసి తమ పాయింట్స్‌ను ఒక కంటెస్టెంట్‌కు త్యాగం చేయాలని బిగ్ బాస్ తెలిపారు. దీంతో ఇద్దరు కలిసి ఏకాభిప్రాయంతో అమర్‌దీప్‌కు తమ పాయింట్స్‌ను ఇచ్చేశారు. దీంతో టాస్కుల్లో వెనకబడి ఉన్నా.. అమర్‌కు టాప్ స్థానం దక్కింది. అప్పటినుంచి మరింత పట్టుదలతో ఆడడం మొదలుపెట్టాడు అమర్‌దీప్. కానీ మొదటి జరిగిన మూడు టాస్కుల్లో అర్జున్‌దే పైచేయి ఉంది. అందుకే తనకు ఎవరు పాయింట్స్ త్యాగం చేయకపోయినా.. రెండో స్థానంలో ఉండగలిగాడు.


ఎవ్వరు సాయం చేయలేదు..
మరికొన్ని టాస్కులు పూర్తయిన సమయానికి ప్రియాంక లాస్ట్‌లో ఉండడంతో తన పాయింట్స్‌ను గౌతమ్‌కు ఇచ్చేసింది. దీంతో అమర్‌దీప్ అలిగాడు, ప్రియాంకపై కోప్పడ్డాడు, తనను మాటలతో హింసించాడు. అమర్‌తో పాటు శోభా కూడా చేరింది. దీంతో ప్రియాంక తట్టుకోలేక.. గౌతమ్ పాయింట్లను అమర్‌కు ఇచ్చేలా చేసింది. ఒకవేళ ఆట నుంచి తప్పుకుంటే గౌతమ్.. తనకే పాయింట్స్ ఇస్తాడని నమ్మాడు అర్జున్. కానీ అలా జరగకపోవడంతో ప్రశాంత్, అమర్‌‌లకంటే తన దగ్గరే చాలా తక్కువ పాయింట్లు ఉన్నాయి. దీంతో తనలో పట్టుదల మరింత పెరిగింది. ఎవరూ తనకు పాయింట్స్ ఇవ్వకపోయినా పర్వాలేదని, గెలవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తనకు ఎవరూ పాయింట్స్ ఇవ్వకపోయినా.. మొదటి నుంచి దాదాపు అన్ని టాస్కులను గెలుస్తూ వచ్చి.. ఫైనల్‌గా ఫినాలే అస్త్రాను దక్కించుకున్నట్లు తెలిసింది. మరి, అమర్ ఇప్పటికైనా పాయింట్లతో కాదు.. ఆటతో గెలవాలని తెలుసుకుంటాడో లేదో.


Also Read: తప్పు చేసిన శోభా - తనతో పాటు కంటెస్టెంట్స్ అందరికీ ‘బిగ్ బాస్’ పనిష్మెంట్, ఇదేం ట్విస్ట్?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply