Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫినాలే అస్త్రా రేసు ప్రారంభం అయినప్పటి నుండి మిగతావారితో పోలిస్తే ఎవరైతే తక్కువ పాయింట్లు సాధించుకుంటున్నారో.. వారు రేసు నుండి తప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ తప్పుకునే ముందు వారి పాయింట్స్‌ను వేరే కంటెస్టెంట్స్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. కంటెస్టెంట్స్ అంతా ఫినాలే అస్త్రాకు రెండు అడుగులు దూరంలో ఉండగా.. గౌతమ్ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. ప్రియాంక ఒత్తిడి వల్ల గౌతమ్.. తన పాయింట్స్‌ను అమర్‌దీప్‌కు ఇవ్వాల్సి వచ్చింది. దాని వల్ల అర్జున్‌కు అన్యాయం జరిగింది. అది చూసి శివాజీ కామెడీ చేశాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


గౌతమ్‌పై ప్రియాంక ఒత్తిడి..
స్కోర్ బోర్డ్‌లో మిగతావారికంటే గౌతమ్ దగ్గర తక్కువ పాయింట్స్ ఉన్నందుకు ఫినాలే అస్త్రా రేసు నుండి తప్పుకోవాలని బిగ్ బాస్ ప్రకటించారు. ‘మీరు సాధించిన పాయింట్స్‌లో నుండి 140 పాయింట్లు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది’ అని అన్నారు. గౌతమ్ మనసులో పాయింట్లు అర్జున్‌కు ఇవ్వాల్సి ఉన్నా.. ప్రియాంక తనను అడగడంతో కాదు అనలేకపోయాడు. అందుకే అర్జున్‌కు అదే విషయాన్ని చెప్పాడు. ‘‘ప్రియాంక ఏమన్నదంటే పాయింట్స్ నాకు ఇచ్చింది కదా. ఒకవేళ నేను ఇవ్వాల్సి వస్తే అమర్‌కు ఇవ్వాలని అడిగింది’’ అని అన్నాడు. దానికి అర్జున్‌కు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ‘‘నీ ఇష్టం. నేనేం అనలేను’’ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.


అన్యాయం అయిపోయిన అర్జున్..
‘‘ఇవి ప్రియాంక పాయింట్స్.. ఇంకొకసారి ప్రియాంకను ఏం అనకు’’ అని అమర్‌కు చెప్తూ పాయింట్లు అమర్‌కే ఇస్తున్నట్టు ప్రకటించాడు గౌతమ్. ఆ మాటకు శోభాకు కోపం వచ్చింది. ‘‘పాయింట్స్ ఇచ్చేటప్పుడు ఇస్తున్నా అని చెప్పు. ఇంకొకసారి ఏం అనకు అని ఇస్తే అది కరెక్ట్ కాదు కదా’’ అని రివర్స్ అయ్యింది. ఇప్పటివరకు రేసు నుండి తప్పుకున్న ప్రతీ ఒకరు తమ పాయింట్లను ప్రస్తుతం రేసులో ఉన్న అమర్‌దీప్‌కు, పల్లవి ప్రశాంత్‌కు అందించారు. కానీ అర్జున్‌కు మాత్రం ఎవరూ తమ పాయింట్లను ఇవ్వలేదు. ప్రస్తుతం తన దగ్గర ఉన్న పాయింట్లు మొత్తం తను టాస్కులు ఆడి సంపాదించుకున్నవే. అయితే గౌతమ్ అయినా తనకు ఇస్తాడనుకుంటే అది కూడా కుదరలేదు. దీంతో ఏం చేయాలో తెలియక మౌనంగా కూర్చున్నాడు అర్జున్. అదే సమయంలో అక్కడే ఉన్న శివాజీ.. అర్జున్ పరిస్థితి చూసి కామెడీ చేశాడు.


శివాజీ, ప్రశాంత్ కామెడీ..
‘‘అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి’’ అంటూ అర్జున్‌ను చూసుకుంటూ పాట పాడాడు శివాజీ. గౌతమ్ పాయింట్లు కూడా తనకే యాడ్ అవ్వడంతో అమర్‌కు మొత్తంగా 1000 లభించాయి. అది చూసి అమర్ మురిసిపోయాడు. ‘‘అన్న మొఖం కలకలలాడుతుంది. కట్నాలు చదివించుకునేవాళ్లు చదివించుకోండి’’ అంటూ కామెడీ చేశాడు ప్రశాంత్. ఒకవేళ గౌతమ్.. తన పాయింట్లను అర్జున్‌కు ఇచ్చుంటే గేమ్ చాలా ఫెయిర్‌గా ఉండేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. అలా జరిగుంటే అమర్‌దీప్, ప్రశాంత్, గౌతమ్‌లకు సమాన పాయింట్లు ఉండేవి. అప్పుడు టాస్క్‌లో ఎవరు గెలిస్తే.. వారికే ఫినాలే అస్రా దక్కేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అమర్‌కు 1000 పాయింట్లు దక్కడంతో ప్రశాంత్, అర్జున్.. టాస్కులు ఎంత బాగా ఆడినా.. తనను అందుకునే ఛాన్స్ చాలా తక్కువ. ఒకవేళ అమర్‌కంటే ప్రశాంత్ బాగా ఆడితే.. తను గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ అర్జున్‌ మాత్రం ఇంక ఫినాలే అస్త్రాపై ఆశలు వదులుకోవాల్సిందే.



Also Read: ఫినాలే అస్త్రా గెలుచుకుంటే మాత్రం అమర్ ఏమైనా సూపర్ స్టారా? - శివాజీ


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply