బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా మణిపూర్‌కు చెందిన లిన్ లైష్రామ్‌తో రణదీప్ వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. తన పెళ్లి విషయాన్ని రణదీప్ స్వయంగా ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రకటించాడు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మణిపూర్‌లో వివాహం జరిగిన తర్వాత ముంబాయ్‌లో సెలబ్రిటీలకు గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనుందట ఈ జంట.


ఇద్దరూ ఆర్టిస్టులే..
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటుల్లో రణదీప్ హుడా కూడా ఒకడు. ముందుగా విలన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు రణదీప్. ఇప్పటికీ తన చేతిలో పలు సినిమాలు ఉండగా.. షూటింగ్ నుండి బ్రేక్ తీసుకొని తన గర్ల్‌ఫ్రెండ్ లిన్ లైష్రామ్‌ను మణిపూర్‌లో వివాహం చేసుకున్నాడు. మణిపూర్‌కు చెందిన లిన్.. ముందుగా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత హిందీ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటించడం మొదలుపెట్టింది. మెల్లగా తనకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు రావడం మొదలయ్యింది. చివరిగా కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించిన ‘జానే జాన్’ చిత్రంలో కూడా లిన్ లైష్రామ్ నటించింది.


మణిపూరీ సాంప్రదాయాలు..
మేటే సాంప్రదాయాల ప్రకారం రణదీప్, లిన్ పెళ్లి జరిగింది. మణిపూర్‌లోని ఇంఫాల్‌లోని ఒక గుడిలో వీరు పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా మణిపూర్ పెళ్లికొడుకు, పెళ్లికూతురులా రెడీ అయిన వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఎన్నో బాలీవుడ్ పెళ్లిళ్లలకు భిన్నంగా రణదీప్, లిన్ వివాహం జరిగింది. ఎక్కువగా వైట్ కలర్ పూలమాలలతో మండపాన్ని అలంకరించారు. పైగా ఇలాంటి సాంప్రదాయాలతో, ఆచారాలతో ముందెప్పుడూ ఏ బాలీవుడ్ సెలబ్రిటీ వివాహం జరగలేదు. ఇక వీరి వివాహానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.






రెండు రోజుల ముందే..
నవంబర్ 29న రణదీప్, లిన్ వివాహం జరగగా.. నవంబర్ 27న వీరిద్దరూ మణిపూర్ చేరుకున్నారు. ముందుగా అక్కడ గుడిలో పూజలు పూర్తి చేసుకున్న తర్వాత.. మొయిరాంగ్, లోక్తక్ లేక్ దగ్గర క్యాంపింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇంఫాల్ వెస్ట్‌లోని లంగ్తాబాల్‌లో ఉన్న చుంతగ్ సనాపంగ్ వద్ద రణదీప్, లిన్ పెళ్లి జరిగింది. తన పెళ్లికి వారం రోజుల ముందే మణిపూర్‌లో వివాహం జరగనున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు రణదీప్. అయితే పెళ్లి తర్వాత ముంబాయ్‌లో రిసెప్షన్ కూడా ఉంటుందని తెలిపాడు. కానీ ఆ రిసెప్షన్ గురించి ఇంకా ఏ ఇతర వివరాలు బయటికి రాలేదు. ‘‘ఈ కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నందుకు మాకు మీ ఆశీస్సులు కావాలి. వేర్వేరు కల్చర్స్‌ను ఒక్కటి చేస్తున్నందుకు మీ ప్రేమ మాకు కావాలి’’ అంటూ రణదీప్.. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లిన్ సైతం ఇదే పోస్ట్‌ను తన ఫాలోవర్స్‌తో పంచుకుంది.


Also Read: నిజమేంటో వారికి తెలుసు - మరోసారి విడాకులపై స్పందించిన నాగచైతన్య


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply