సినీ సెలబ్రిటీల కెరీర్ గురించికంటే వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా వారి రిలేషన్‌షిప్స్ గురించి, వైవాహిక జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. గత కొన్నాళ్లుగా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య పర్సనల్ లైఫ్‌పై కూడా ప్రేక్షకులు ఇలాగే దృష్టిపెట్టారు. ముఖ్యంగా సమంతతో విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత చైతూ పర్సనల్ లైఫ్ గురించి తరచుగా ఏదో ఒక కొత్త రూమర్ క్రియేట్ అవుతూ ఉంది. ప్రస్తుతం తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నాగచైతన్య.. ఈ విషయంపై స్పందించాడు.
పర్సనల్ లైఫ్‌పై ఫోకస్..
సమంతతో వివాహం అవ్వకముందు.. నాగచైతన్య పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు పెద్దగా ఏమీ తెలియదు. కానీ సామ్‌తో వివాహం అయ్యి.. విడాకులు అయిన తర్వాత చైతూ పర్సనల్ లైఫ్ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విడాకులు అయిన తర్వాత కూడా ఈ విషయం గురించి స్పందించడానికి చైతూ ఎప్పుడూ వెనకాడలేదు. అదే విధంగా మరోసారి తన పర్సనల్ లైఫ్‌పై వస్తున్న వార్తలపై తను స్పందించాడు. తన వ్యక్తిగత జీవితంపై అందరూ ఫోకస్ పెట్టడం తనకేం ఇబ్బంది లేదు కానీ తనను వర్క్ పరంగా అందరూ గుర్తుపెట్టుకోవడమే తనకు ఎక్కువగా సంతోషాన్ని ఇస్తుందని బయటపెట్టాడు నాగచైతన్య.
క్లోజ్‌గా ఉండేవారికి తెలుసు..
‘‘ఒక పాయింట్ తర్వాత దాని గురించి నేను అసలు పట్టించుకోను. నాతో క్లోజ్‌గా ఉండే మనుషులకు నా గురించి నిజాలు తెలుసు. ఆ విషయం పక్కన పెడితే.. నా పర్సనల్ లైఫ్ ద్వారా నేను అందరికీ తెలియడం కంటే నా వర్క్ పరంగా యాక్టర్‌గా అందరికీ తెలిస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను. అందుకే నేను నా వర్క్‌పైనే దృష్టిపెట్టాలని అనుకుంటున్నాను. ఇకపై నా సినిమాలే మాట్లాడతాయి. నా సినిమాలు గొప్పగా ఉండి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తే ప్రేక్షకులు నన్ను వాటి ద్వారానే గుర్తుపెట్టుకోవాలి’’ అని నాగచైతన్య అన్నాడు.
మంచి థ్రిల్లర్ సిరీస్..
ఇక కెరీర్ విషయానికొస్తే.. నాగచైతన్య తాజాగా ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అక్కినేని ఫ్యామిలీ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ‘దూత’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఈ శుక్రవారం ‘దూత’ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్ల ముందుకు వచ్చింది. ఇందులో చైతూ ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపించాడు. థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ఇష్టపడేవారికి ‘దూత’ కూడా తప్పకుండా నచ్చుతుందని ఇప్పటికే ఈ సిరీస్‌పై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ‘దూత’లో నాగచైతన్యకు జంటగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. పార్వతీ తిరువోతు, ప్రాచీ దేశాయ్.. ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఇక చైతూ చివరిగా ‘కస్టడీ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. అది యావరేజ్‌గా నిలిచింది. అందుకే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు ‘తండేల్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది మూవీ టీమ్. ‘తండేల్’ ఫస్ట్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్ లభించింది.
Also Read: దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply