Jigarthanda Double X OTT : కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్, ఎస్. జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. విడుదలై నెలరోజులు అవ్వకుండానే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుండడం గమనార్హం. ఇంతకీ 'జిగర్తాండ డబుల్ ఎక్స్' ఓటీడీ రిలీజ్ ఎప్పుడు? డీటెయిల్స్ లోకి వెళ్తే.. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్. జె సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జిగర్తాండ డబల్ ఎక్స్'. 2014లో వచ్చిన 'జిగర్తాండ' అనే సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. సిద్ధార్థ్, బాబీసింహ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం, అందులోనూ రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య లాంటి యాక్టర్స్ నటిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలా భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా నవంబర్ 10న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలో లారెన్స్, SJ సూర్య తమ నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆడియన్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.

ముఖ్యంగా సినిమా రిలీజ్ అయిన సమయంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ట్వీట్ చేస్తూ.." జిగర్ తాండ డబుల్ ఎక్స్ సినిమా చూశాను. కార్తీక్ సుబ్బరాజు నుంచి వచ్చిన మరో ఫెంటాస్టిక్ చిత్రం. అద్భుతంగా నటించడం ఎస్. జె సూర్యకు అలవాటయిపోయింది. ఒక నటుడుగా రాఘవ లారెన్స్ అదరగొట్టారు. సంతోష్ నారాయణ మ్యూజిక్ బాగుంది. చివరి 40 నిమిషాలు మనసు దోచుకుంటుంది. సినిమా టింకు ఆల్ ద బెస్ట్" అంటూ ట్వీట్ చేశారు. సినీ ప్రముఖులతో పాటు క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ రావడం విశేషం. అలా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది.

ఇక ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. వచ్చే శుక్రవారం అంటే డిసెంబర్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఆఫీషియల్ గా పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. నిమిషా సజయన్, షైన్ టామ్ చాకో, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందించగా కార్తికేయ సంతానం, ఎస్. కతిరేసన్ సంయుక్తంగా నిర్మించారు.

Also Read : 'బచ్చలమల్లి'గా అల్లరి నరేష్ - ఆసక్తి రేకెత్తిస్తోన్న పోస్టర్, గజదొంగగా కనిపించనున్నఅల్లరోడు!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply