Allari Naresh : అల్లరి నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో లాగా రొటీన్ కథలు కాకుండా విభిన్న తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన కెరీర్లో కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు మాత్రం సీరియస్ సబ్జెక్ట్స్ తో మెప్పిస్తున్నాడు. అందులోనూ తన నటనతో అదరగొడుతున్నారు .సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రయోగాల బాట పడుతూ ఈ హీరో నటించిన 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం' వంటి సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. చివరగా 'ఉగ్రం'తో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన అల్లరి నరేష్ ఆ వెంటనే తన తదుపరి సినిమాని అనౌన్స్ చేసాడు.


#Naresh62 అనే వర్కింగ్ టైటిల్ తో తన పుట్టినరోజు సందర్భంగా గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా మూవీ టీం టైటిల్ ని రివీల్ చేసింది. అల్లరి నరేష్ కెరీర్లో 62వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బచ్చలమల్లి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇంతకీ 'బచ్చలమల్లి' అనే టైటిల్ లో ఉన్న వ్యక్తి పేరు ఎవరిది? ఈ ప్రాజెక్టుకి ఆ టైటిల్ కి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయానికొస్తే.. 1990లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని తునిలో గజదొంగగా పేరుగాంచిన బచ్చలపల్లి జీవిత కథనే సినిమాగా తెరకెక్కిస్తున్నారు.






తుని ప్రాంతంలో రౌడీగానూ ముద్ర వేసుకున్న బచ్చలపల్లి పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నారు. ఓ వైపు సీరియస్ గా కథని నడిపిస్తూనే మరోవైపు కామెడీ కూడా హైలెట్ అయ్యేలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సాయి ధరంతేజ్ తో 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుబ్బు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకులుగా పనిచేస్తున్నారు. అల్లరి నరేష్ తో 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాను నిర్మించిన హాస్య మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిచర్డ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.


ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే మూవీ టీం అధికారికంగా వెల్లడించనుంది. ఇదిలా ఉంటే అల్లరి నరేష్ ఇప్పటివరకు ఇలాంటి బయోపిక్ లో నటించింది లేదు. ఈ హీరో నటిస్తున్న ఫస్ట్ బయోపిక్ ఇదే. ఈ మధ్య టాలీవుడ్ లోనూ పలు బయోపిక్ సినిమాలు వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే టైగర్ నాగేశ్వరరావు, క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ వంటి బయోపిక్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఇప్పుడు అల్లరి నరేష్ కూడా ఈ బయోపిక్ ట్రెండ్ లో జాయిన్ అవ్వడం విశేషం అనే చెప్పాలి.


Also Read : దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply