Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్రా కోసం జరిగిన పోటీ రోజుకొక మలుపు తిరిగింది. కానీ అందరికంటే ముందుగా ఫినాలే అస్త్రా రేసులో అమర్‌కే లక్ కలిసొచ్చింది. రేసులో ముందుగా తప్పుకున్న శివాజీ, శోభాతో పాటు చివరి వరకు వచ్చి ఓడిపోయిన గౌతమ్ కూడా అమర్‌కే పాయింట్స్ ఇవ్వడంతో తనకు మరింత ఎక్స్‌ట్రా లక్ వచ్చిందని ప్రేక్షకులు మాత్రమే కాదు.. కంటెస్టెంట్స్ కూడా అనుకున్నారు. అయితే గౌతమ్.. అమర్‌కు పాయింట్స్ ఇవ్వడంపై హౌజ్‌లో పెద్ద చర్చే జరిగింది. ముఖ్యంగా స్పై బ్యాచ్ అమర్‌పై వ్యంగ్యంగా జోకులు వేయడం మొదలుపెట్టింది. శివాజీ అయితే మరోసారి నాగార్జున వద్దు అన్న పదాలనే ఉపయోగించాడు.


ప్రియాంక తీసుకున్న నిర్ణయంతో అమర్ సేఫ్..
ప్రియాంక అడిగినందుకు తన పాయింట్లను అమర్‌కు త్యాగం చేశాడు గౌతమ్. ఇది అమర్ ఊహించలేదు. అయితే ప్రియాంకను ఊరికే మాటలతో హింస్తున్నారని గౌతమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ప్రియాంకను ఏమీ అనొద్దు అన్నాడు. ఆ విషయం శోభాకు నచ్చలేదు. మామూలుగా ఇవ్వొచ్చు కదా అని గౌతమ్‌పై రివర్స్ అయ్యింది. ఆ తర్వాత ఎవరి గేమ్ వాళ్లు ఆడుతారు మీకొక దండం అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది. అమర్ అయితే ప్రియాంక ఇవ్వాలనుకున్నప్పుడు నాకే ఇవ్వొచ్చుగా తిప్పి తిప్పి ఇవ్వడం ఎందుకు అంటూ తనను విమర్శించడం ఆపలేదు. వాళ్ల మాటలు తట్టుకోలేక ఇలా చేశానని ప్రియాంక కూడా గౌతమ్ దగ్గర ఒప్పుకుంది. గౌతమ్ తీసుకున్న ఈ నిర్ణయం.. అందరిముందు అమర్‌ను ఆశావాదిని చేసింది.


ముందుగా 1000 మార్కులు..
‘‘ఆ విధంగా మనందరం కలిసి ఈ పనికిమాలినోడికి 1000 మార్కులు ఇస్తున్నాం’’ అంటూ స్కోర్ బోర్డ్‌పై అమర్ పాయింట్స్ మార్చాడు శివాజీ. ఇప్పటికే అమర్‌ను చొరవగా అన్న మాటలు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని, ఇంకెప్పుడూ అలా మాట్లాడొద్దని శివాజీకి వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. అయినా శివాజీ మళ్లీ మొదటికొచ్చాడని ప్రేక్షకులు అనుకున్నారు. ఆ తర్వాత కూడా ఏదో విషయంలో మాట్లాడుతూ ‘‘నువ్వు వద్దంటే చెప్పు ఎందుకంటే ఫినాలే అస్త్రా గెలిచేవాడివి, నువ్వు చెప్పింది ఇప్పుడు వినాలి మేము. ఎలాగైనా గెలవచ్చని ప్రూవ్ చేశావురా. ఎవడెవడికి ఎలా రాసిపెట్టుంటే అలా అవుతుంది’’ అంటూ పదేపదే అమర్‌ను ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు శివాజీ.


ఫలించిన అర్జున్ స్ట్రాటజీలు..
ఇక ఫైనల్‌గా ఫినాలే అస్త్రా కోసం అమర్‌దీప్, అర్జున్, ప్రశాంత్ పోటీపడగా.. ముందుగా ఆడిన బాల్స్ గేమ్‌లో ప్రశాంతే ముందుగా బాల్స్ పెట్టినా.. తను కరెక్ట్‌గా పెట్టలేదేమో అన్న అనుమానంతో గంట కొట్టకుండా ఆగిపోయాడు. ఇంతలో అర్జున్ గంట కొట్టేసి టాస్కులో విన్నర్ అయ్యాడు. ఆ తర్వాత ఆడిన జెండాలో టాస్కులో ముందుగా అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్‌లను బెల్టుతో లాక్కెళ్లిపోయి తనవైపు ఉన్న జెండాలను కలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ జెండాలను కలెక్ట్ చేసుకునే వీలు లేకుండా వాళ్లిద్దరినీ చివరికి లాక్కెళ్లిపోయి నిలుచోబెట్టాడు. అమర్, ప్రశాంత్ కలిసి ఎంత ప్రయత్నించినా అర్జున్ బలం ముందు గెలవకలేకపోయారు. ఆ తర్వాత పాయింట్స్ తక్కువగా ఉన్న ప్రశాంత్ పోటీ నుంచి తప్పుకున్నాడు. అమర్, అర్జున్ కలిసి చివరిగా పాముతో చెలగాటం అనే టాస్క్ ఆడారు. టాస్క్ మొదలయిన తర్వాత కాసేపటి వరకు అమరే గెలుస్తాడని అనిపించినా.. నిదానంగా ఆడి అర్జునే టాస్క్‌తో పాటు ఫినాలే అస్త్రాను కూడా గెలిచాడు. దీంతో ఎవరి సపోర్ట్ లేకుండా గెలిచాడంటూ ప్రేక్షకులు అర్జున్‌ను ప్రశంసిస్తున్నారు. 


Also Read: ముగిసిన ఫినాలే అస్త్రా టాస్క్ - ఒంటరి పోరాటం చేసిన ఆ కంటెస్టెంట్‌కే టికెట్, పాపం అమర్!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply