Radhika Apte About Her Cameo in Merry Christmas Movie: బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్ననటి రాధికా ఆప్టే. మిగతా హీరోయిన్లతో పోల్చితే విభిన్నమైన నటనా ప్రయాణంతో ముందుకు సాగుతోంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టీవీ షోల్లోనూ కనిపిస్తుంది. క్ష‌ణం తీరిక లేకుండా గడుపుతున్నా, ఇష్ట‌మైన సినిమాలొస్తే గెస్ట్ రోల్ అయినా ఓకే చెప్పేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమాలో గెస్ట్ రోల్ పోషించింది. ఈ మూవీ గురించి తాజాగా రాధిక కీలక విషయాలు వెల్లడించింది.


కత్రినా కైఫ్ మూవీలో రాధిక గెస్ట్ రోల్


ప్రస్తుతం తమిళ స్టార్ యాక్టర్ విజయ్‌ సేతుపతి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ప్రధాన పాత్రల్లో `మేరీ క్రిస్మ‌స్` అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాధికా ఆప్టే గెస్ట్ రోల్ లో కనిపించనుంది. ఇప్పటికే ఆమె షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. రాధికా గెస్ట్ రోల్ అంటే కనీసం ఐదారు సీన్లలోనైనా కనిపిస్తుందని అందరూ అనుకుంటారు. కానీ, ఇందులో ఆమె కేవలం ఒకే ఒక్క సీన్ లో కనిపించనుంది. రాధిక లాంటి హీరోయిన్ ఒకే ఒక్క సీన్ చేయడం ఏంటని అందరికీ ఆశ్చర్యం కలగకమానదు.  


అతడి కోసమే ఆ సీన్ చేశా- రాధిక


తాజాగా ఈ సినిమాలో నటించడానికి అసలు కారణం చెప్పింది రాధిక. ఈ చిత్రంలో ఒకే సీన్ లో కనిపించడానికి దర్శకుడు శ్రీరామ్ కారణం అని వెల్లడించింది. ఆయన తనకు మంచి ఫ్రెండ్ కావడంతో కాదనలేకపోయినట్లు వివరించింది. ఒక రోజు దర్శకుడు ఫోన్ చేసి, తన సినిమాలో ఒక పాత్ర పోషించాలని చెప్పారట. అదీ ఒక్క సీన్ లోనే కనిపించాల్సి ఉంటుందన్నారట. ఆయనతో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా కాదనలేకపోయినట్లు వివరించింది రాధిక. “`మేరీ క్రిస్మ‌స్` సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడానికి కారణం కేవలం దర్శకుడు శ్రీరామ్. తను నాకు మంచి ఫ్రెండ్‌. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ నేను ఉన్నాను. ఆ సెంటిమెంట్‌ని అలాగే కొనసాగించాలని ఈ సినిమాలో కనిపించాను. ఇందులో నేను చేసింది ఒకే సీన్ అయినా, షూటింగ్‌ మాత్రం రెండు రాత్రులు కొనసాగింది. దర్శకుడు సినిమా పర్ఫెక్ట్ గా వచ్చేందుకు ఎంతగా కష్టపడతాడు అనే దానికి ఈ సీన్ షూటింగే నిదర్శనం” అని చెప్పుకొచ్చింది.  


అటు కీర్తి సురేష్ తో కలిసి రాధికా ఆప్టే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ‘అక్క’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. పీరియడ్ థ్రిల్లర్ గా రూపొందుతున్నఈ సిరీస్ లో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రత్యర్థులుగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ షూటింగ్ 75 శాతానికి పైగా పూర్తి అయిన తర్వాతే అఫీషియల్ ప్రకటనలు చేయాలి అనుకుంటున్నారట మేకర్స్.  


Read Also: ఓటీటీలోకి కీర్తి సురేష్ ఎంట్రీ, బోల్డ్ బ్యూటీతో కలిసి తొలి వెబ్ సిరీస్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply