Prema Entha Madhuram Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఆర్య మాట్లాడుతూ అనుతో ఇలా అంటాడు.. పిల్లల కోసం ఆలోచించండి వాళ్ళకి ఈ వయసులో తండ్రి ప్రేమ అవసరం కదా అని అంటాడు.. ఆ మాటలకూ అను కంటతడి పెట్టుకుంటుంది.


ఆర్య : అయ్యో, బాధపడుతున్నారా పిల్లల బాధ చూసి ఇలా మాట్లాడాను అంతే ఏమీ అనుకోకండి.


అను : పర్వాలేదండి సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే చెప్తాను.


ఆర్య : భోజనం చేసి పడుకోండి. నేను అన్నవి ఏవీ మనసులో పెట్టుకోకండి  అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య.


మరోవైపు ఆర్య అనులను చంపడానికి మాన్సీ, ఛాయాదేవిలు రౌడీలను కలుస్తారు. 


ఛాయాదేవి : ఆర్య దంపతుల ఫోటో చూపించి వీళ్ళని చంపాలి అని చెప్పి వాళ్లకి డబ్బు ఇచ్చి పని పూర్తయిన తర్వాత మిగిలిన డబ్బు ఇస్తాను అంటుంది. తర్వాత మాన్సీ వైపు తిరిగి వీళ్ళని చూస్తే అను ఆర్యల చావు కళ్ళ ముందు కనబడుతుంది అంటుంది.


మరోవైపు వాళ్ల ప్రేమనే కథగా రాస్తూ ఉంటాడు ఆర్య. అదే సమయంలో అను ఇంట్లో కూర్చొని వత్తులు చేస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన దివ్య ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.


అను : రేపు కార్తీక పౌర్ణమి కదా దీపాలు వెలిగించడానికి ఒత్తులు చేస్తున్నాను.


దివ్య: మా అమ్మ కూడా మీలాగే పూజలు చేస్తుంది కానీ ఆ దేవుడు కరుణించడం లేదు. నాకు తెలిసి మీరు కూడా సంతోషంగా లేరు అయినా ఎందుకు ఈ పూజలు.


అను: ఏదో ఆశించి దేవుడిని పూజించకూడదు భక్తిగా దేవుడిని పూజిస్తే ఆయన చేయవలసిన పని ఆయన చేస్తాడు.


దివ్య: మీరు అర్థం కారు, మీ మాటలు అర్థం కావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


మరోవైపు బయటికి వెళ్లిన ఉషవాళ్ళు ఇంటికి వస్తారు. పిల్లలు ఆనందంగా అక్కడ చూసిన వాటి గురించి చెప్తారు. నీ దగ్గరే పడుకుంటాం ఫ్రెండ్ అని చెప్పడంతో ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పి లోపలికి పంపిస్తాడు ఆర్య.


ఉష : అన్నయ్య ఇక్కడ ఉన్నాడు, రాధ గారు లోపల ఉన్నారు అసలు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారా అని అనుకుంటుంది. నువ్వు భోజనం చేసావా రాధ గారికి భోజనం పెట్టావా అని ఆర్యని అడుగుతుంది.


ఆర్య : ఇద్దరం భోజనం చేసాము అంటాడు.


ఉష: కలిసే భోజనం చేశారా


ఆర్య: లేదు. తన గదిలో ఆమె, బయట నేను భోజనం చేసాము.


ఉష: సరిపోయింది, ఈ మాత్రానికేనా నేను ఇంత ప్లాన్ చేసింది అని మనసులో అనుకుంటుంది. తరువాత ఆర్య రాసిన కథని చదివి చాలా బాగుంది అన్నయ్య తర్వాతే ఏం జరిగిందో నాకు చెప్పు అంటుంది.


ఆర్య : ముందే తెలిస్తే ఏం ట్విస్ట్ ఉంటుంది అంటాడు.


ఈ కథని పోస్ట్ చేస్తాను అంటూ ఆ పేపర్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది.


తర్వాత పిల్లలు ఫ్రెష్ అయ్యి బయటకు వస్తే వాళ్లతో మాట్లాడి వాళ్ళు పడుకున్న తరువాత రేపు కచ్చితంగా నిన్ను కలుస్తాను అనిపిస్తుంది అను. రేపు త్వరగా తెల్లారి, త్వరగా చీకటి పడితే బాగుండు అనుకుంటాడు.


మరుసటి రోజు పొద్దున్న ముగ్గు వేసి తులసమ్మకి దీపం పెడుతుంది అను. అప్పుడే వాకింగ్ నుంచి వచ్చిన ఆర్య దీపం గాలికి కొండెక్కకుండా చేతులు అడ్డు పెడతాడు. అది చూసి ఆనందిస్తుంది అను.


మరోవైపు కుంటుకుంటూ వస్తున్న నీరజ్ ని చూసి ఏమైంది అని అంటాడు జెండే.


నీరజ్ : చిలుకూరి బాలాజీ టెంపుల్ కి వెళ్లాను.


జెండే: అయితే ఎందుకు కుంటుతున్నావు అని అడగడంతో... నీరజ్ డ్రైవర్ మాట్లాడుతూ గుడిలో వెయ్యి ఒక ప్రదక్షిణ చేశారు అని చెప్తాడు.


జెండే : అర్థమైంది ఇదంతా ఆర్య కోసమే కదా అంటాడు.


నీరజ్ : అవును జెండే, వదినమ్మ దొరుకుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు దాదా. వాళ్ళిద్దరూ కలవాలని ఇలా చేశాను ఇంతకుమించి ఏం చేయగలను.


జెండే : అలాంటి అన్నయ్య దొరకడం నీకు అదృష్టమైతే ఇంత ప్రేమని పొందడం ఆర్య అదృష్టం. అను, ఆర్య కచ్చితంగా కలుస్తారు అని అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.  


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply