Actress Kangana Ranaut On Contesting 2024 LokSabha Elections: సినీ నటులు చాలా మంది రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్ట సభల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజా సమస్య పరిష్కారం కోసం పార్లమెంట్, అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. కంగనా కూడా తన రాజకీయ అరంగేట్రంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజుల క్రితం ద్వారక శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన ఆమె, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు వెల్లడించింది. శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటే, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పింది. ఈ ప్రకటనతో ఆమె రాజకీయాల్లోకి రావడం ఖాయం అనే వార్తలు వినిపించాయి.  


పొలిటికల్ ఎంట్రీ వార్తపై స్పందించిన కంగనా


కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కంగనా రనౌత్ బీజేపీ నుంచి పోటీ చేయనున్నారనే వార్త హల్ చల్ చేసింది. చండీగఢ్ నుంచి పార్లమెంట్ బరిలో దిగనున్నట్లు ఓ పోస్టర్ బాగా సర్క్యులేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో కంగనా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా కీలక విషయాన్ని వెల్లడించింది. తాను చండీగఢ్ నుంచి పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించింది. చండీగఢ్ నుంచి బీజేపీ తనకు లోక్ సభ టికెట్ ఇస్తుందని ఎప్పుడూ చెప్పలేదని వెల్లడించింది. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పింది. “నా పొలిటికల్ ఎంట్రీ గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. సదరు క్లిప్ ను నా ఫ్రెండ్స్, బంధువులు పంపిస్తున్నారు. నా పేరిట ప్రచారం జరుగుతున్న ఆ వార్తతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే” అని వెల్లడించింది.  


‘ఎమర్జెన్సీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కంగనా    


కంగనా రీసెంట్ గా ‘తేజస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో ఆమె IAF అధికారి తేజస్ గిల్ పాత్రను పోషించింది. అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్రతో కలిసి ఒక భారతీయ గూఢచారిని రక్షించే మిషన్ కథతో ఈ మూవీ తెరకెక్కింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేదు. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. అటు తమిళ కామెడీ-హారర్ సీక్వెల్  ‘చంద్రముఖి 2’లోనూ కంగనా కనిపించింది. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా సినీ అభిమానులను అంతగా అలరించలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ’ఎమర్జెన్సీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కంగనా, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. స్వాంత్రంత్య భారత చరిత్రలో చీకటి రోజులుగా పరిగణించే ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.


Read Also: టీ-సిరీస్ అధినేతకు బిగ్ రిలీఫ్, అత్యాచారం కేసును ఎత్తివేసిన న్యాయస్థానం



ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply