Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా? 

Salaar trailer gives Ugramm vibes: 'సలార్' ట్రైలర్ విడుదలైన తర్వాత మరోసారి కన్నడ సినిమా 'ఉగ్రం' పేరు తెరపైకి వస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తాను ఓసారి తీసిన సినిమాను మరోసారి తీస్తున్నారా?

Continues below advertisement

Is Salaar a copy of Ugramm? 'సలార్' ట్రైలర్ విడుదలైంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అంతగా నచ్చలేదు. వాళ్ళ అంచనాలను ట్రైలర్ 100 పర్సెంట్ అందుకోలేదు. సామాన్య ప్రేక్షకుల నుంచి సైతం మిశ్రమ స్పందన లభిస్తోంది. అవన్నీ పక్కన పెడితే... 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత మరోసారి కన్నడ సినిమా 'ఉగ్రం' పేరు తెరపైకి వస్తోంది.

Continues below advertisement

'కెజియఫ్' తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) పేరు దేశమంతా తెలిసింది. అయితే... ఆ సినిమాల కంటే ముందు కన్నడలో ఆయన ఓ సినిమా చేశారు. అది 'ఉగ్రం'. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్' ఆ సినిమాకు రీమేక్ అని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు రవి బస్రూర్ కన్నడ మీడియాతో ఓసారి 'ఉగ్రం సినిమాకు రీమేక్ అని అందరికీ తెలిసిన విషయమే అని చెప్పారు. అది పక్కన పెడితే... ట్రైలర్ విడుదల తర్వాత రెండు కథల మధ్య కంపేరిజన్స్ మొదలు అయ్యాయి. 

ఉగ్రం... సలార్... ప్రాణ స్నేహితులు!
'నీ కోసం ఎర అయినా అవుతా! సొర అయినా అవుతా' - ట్రైలర్ ప్రారంభంలో యంగ్ 'సలార్' (ప్రభాస్ చిన్ననాటి పాత్రధారి) చెప్పే డైలాగ్. స్నేహితుడి కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉండే వ్యక్తిగా హీరోని చూపించారు. 

ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)... 'సలార్'లో వీళ్లిద్దరూ ప్రాణ స్నేహితులుగా కనిపిస్తారని ట్రైలర్ చూస్తే అర్థం అయ్యింది. కుర్చీ కోసం జరిగిన కుతంత్రాలు, యుద్ధంలో ప్రత్యర్థులు వేర్వేరు దేశాల నుంచి సైనాలను దింపితే... వరద రాజ మన్నార్ మాత్రం తన స్నేహితుడు దేవా (ప్రభాస్)ను పిలుస్తాడు. ఆ ఒక్కడూ వందల మంది సైన్యంతో సమానమని చెప్పకనే చెప్పారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమ చూపించే వాళ్ళిద్దరూ శత్రువులుగా మారితే? అదీ సినిమా కథ. 

Also Readయానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

ఒక్కసారి 'సలార్' కథ పక్కన పెట్టి... 'ఉగ్రం' కథను చూస్తే? అందులోనూ హీరోకి ఓ స్నేహితుడు ఉంటాడు. చీకటి సామ్రాజ్యంలో స్నేహితుడిది పైచేయి కావాలని, అతనికి అధికారం కట్టబెట్టాలని స్నేహితుడు వస్తాడు. అందరినీ ఎదురించి మాఫియా సామ్రాజ్యంలో కుర్చీ కట్టబెడతాడు. తర్వాత స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. ఫ్రెండ్ తమ్ముడి చావుకు హీరో కారణం అవుతాడు. దాంతో స్నేహం బదులు శత్రుత్వం ఏర్పడుతుంది. 

Also Readదూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

'ఉగ్రం' కథకు, 'సలార్' ట్రైలర్ (Salaar Trailer)లో ప్రభాస్ చూపించిన అంశాలకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయని నెటిజనులే చెబుతున్నారు. సినిమా రిలీజ్ అయితే ఎంత వరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'ఉగ్రం' సినిమాకు 'సలార్' రీమేక్ కాదని ప్రశాంత్ నీల్ చెప్పారు. రెండు సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయేమో!? వెయిట్ అండ్ వాచ్!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Appl

Continues below advertisement