తమిళ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి
తమిళనాట విషాదం చోటు చేసుకుంది. ఇటు చిత్రసీమ, అటు రాజకీయ రంగంలో కీలక వ్యక్తి ఇవాళ ఉదయం కన్ను మూశారు. తమిళ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. విజయకాంత్ గత కొన్నేళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా ఆయన చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే... ఈ ఏడాది నవంబర్ 18న జలుబు, దగ్గు తీవ్రతరం కావడంతో చెన్నైలోని బోరూర్‌ ఏరియాలో గల మయత్ ఆస్పత్రిలో చేరారు. సుమారు 23 రోజుల చికిత్స అనంతరం గత డిసెంబర్ 11న డిశ్చార్జ్ అయ్యారు. ఆ మధ్య కాలంలో విజయకాంత్ ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వ్యాపించాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


చిరు లేకపోతే హిమాలయాల బాట పట్టేవాడిని, విక్టరీ వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంటకేష్ నటించిన తాజా చిత్రం ‘సైంధవ్’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో  హైదరాబాద్‌లో జేఈర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ‘వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్’ పేరుతో వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి లేకపోతే సినిమాలను వదిలేసి హిమాలయాలకు వెళ్లే వాడినని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘లియో 2‘ పట్టాలెక్కేది అప్పుడే, క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు లోకేష్
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘లియో’. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపించింది. విజయ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్టులో చేరింది. ఈ నేపథ్యంలో ‘లియో’కు సీక్వెల్ ఉంటుందని గత కొంతకాలంగా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. తాజాగా దర్శకుడు లోకేష్ ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఆ కారణంతోనే నవీన్‌ను తొలగించాం, ‘డెవిల్’ వివాదంపై స్పందించిన అభిషేక్‌ నామా
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి తొలుత నవీన్ మేడారం దర్శకత్వం వహించారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయ్యాక, ఈ సినిమాకు అభిషేక్ నామా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని ప్రకటించారు. దర్శక నిర్మాత అభిషేక్ నామా అంటూ ప్రచారం మొదలు పెట్టారు. దీంతో ఈ సినిమా నుంచి నవీన్ మేడారంను తొలగించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నవీన్ మేడారం కూడా సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ నుంచి తనను తప్పించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఎవరు ఏం అనుకున్నా, ఈ సినిమాకు తానే దర్శకుడినని తేల్చి చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఏ అమ్మాయితో తిరగట్లేదు - వైరల్ వీడియోపై స్పందించిన విశాల్
కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా న్యూయార్క్ వీధుల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. న్యూయార్క్ లో అమ్మాయి భుజంపై చేయి వేసుకొని రోడ్డుపై నడుస్తూ కనిపించాడు. అతన్ని అక్కడ కొందరు గుర్తుపట్టి విశాల్ అని పిలవగానే అమ్మాయితో కలిసి పరుగులు పెట్టాడు. కెమెరాకి కనిపించగానే షర్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకున్నాడు. అమ్మాయి ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చాయి. ఈ వైరల్ వీడియో వ్యవహారంపై తాజాగా విశాల్ స్పందించారు. ఆ వీడియో కేవలం ఫ్రాంక్ అని చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)