Abhishek Nama On Devil Controversy: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి తొలుత నవీన్ మేడారం దర్శకత్వం వహించారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయ్యాక, ఈ సినిమాకు అభిషేక్ నామా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని ప్రకటించారు. దర్శక నిర్మాత అభిషేక్ నామా అంటూ ప్రచారం మొదలు పెట్టారు. దీంతో ఈ సినిమా నుంచి నవీన్ మేడారంను తొలగించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నవీన్ మేడారం కూడా సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ నుంచి తనను తప్పించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఎవరు ఏం అనుకున్నా, ఈ సినిమాకు తానే దర్శకుడినని తేల్చి చెప్పారు.


హ్యాండిల్ చేయలేకపోవడంతో తొలగించాం- అభిషేక్ నామా


నవీన్ మేడారం కామెంట్స్ నేపథ్యంలో ‘డెవిల్’ దర్శక నిర్మాత అభిషేక్ నామా స్పందించారు. నవీన్ ను సినిమా నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరించారు. ఆయన తాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు.  ఈ ప్రాజెక్టును నవీన్ హ్యాండిల్ చేయలేకపోయారని చెప్పారు. అందుకే ఆయనను తొలగించి, తాను ఆ బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చిందన్నారు.  ప్రస్తుతం అభిషేక్ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.


‘డెవిల్’ దర్శకుడిని నేను- నవీన్ మేడారం


అటు ‘డెవిల్’ సినిమాను తానే తెరకెక్కించానని నవీన్ మేడారం తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 100 రోజులకు పైగా కష్టపడి ఈ సినిమాను చిత్రీకరించినట్లు చెప్పారు. కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలిందన్నారు. సినిమాకు తానే దర్శకుడిగా వ్యవహరించినా ఏమాత్రం క్రెడిట్ ఇవ్వకపోవడం బాధ కలిగించిందన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఈ సినిమాకు తానే దర్శకుడినని వెల్లడించారు. ఈ సినిమా ఓ ప్రాజెక్టు కాదని, తన బేబీ అని ప్రకటించారు. ఈ సినిమా కోసం హీరో కల్యాణ్‌రామ్‌ ఎంతో శ్రమించారని చెప్పారు. ఈ చిత్రం తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుందన్నారు.  నవీన్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా అభిషేక్‌ నామా రెస్పాండ్ అయ్యారు.


‘డెవిల్’ వివాదంపై కల్యాణ్ రామ్ ఏమన్నారంటే?  


అటు ఈ వివాదంపై హీరో కల్యాణ్ రామ్ సైతం స్పందించారు. ఈ వివాదం గురించి తాను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అసలేం జరిగిందనే విషయాన్ని అభిషేక్ నామా చెప్తేనే బాగుంటుందన్నారు. అందుకే  ఆ విషయం గురించి ఏమీ మాట్లాడొద్దనుకుంటున్నట్లు వెల్లడించారు. ‘డెవిల్’ మూవీ పిరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కింది. 1942లో జరిగిన కథగా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. మాళవిక నాయర్ కీలక పాత్ర పోషించింది. డిసెంబర్ 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Read Also: ‘లియో 2‘ పట్టాలెక్కేది అప్పుడే, క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు లోకేష్