Vishal On Viral Video: కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా న్యూయార్క్ వీధుల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. న్యూయార్క్ లో అమ్మాయి భుజంపై చేయి వేసుకొని రోడ్డుపై నడుస్తూ కనిపించాడు. అతన్ని అక్కడ కొందరు గుర్తుపట్టి విశాల్ అని పిలవగానే అమ్మాయితో కలిసి పరుగులు పెట్టాడు. కెమెరాకి కనిపించగానే షర్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకున్నాడు. అమ్మాయి ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చాయి.  కొంత మంది విశాల్ పై తీవ్ర విమర్శలు చేశారు. సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


వైరల్ వీడియోపై వివరణ ఇచ్చిన నటుడు విశాల్


ఈ వైరల్ వీడియో వ్యవహారంపై తాజాగా విశాల్ స్పందించారు. ఆ వీడియో కేవలం ఫ్రాంక్ అని చెప్పారు. ఎవరై తన ప్రవర్తన పట్ల బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. ‘‘ సినీ అభిమానులు, నెటిజన్లతో పాటు అందరూ నన్ను క్షమించండి. ఆ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోలో కొంత వాస్తవం ఉంది. మరికొంత ఫ్రాంక్ ఉంది. ఆ వీడియోను న్యూయార్క్ లో తీశాం. నేను, మా కజిన్స్ అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాం. కొద్ది రోజుల పాటు సరదాగా గడుపుతాం. ఏడాదంతా సినిమాలతో కలిగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆ వెకేషన్ ఉపయోగపడుతుంది. తాజాగా వైరల్ అయిన వీడియోలో, నేను ముఖాన్ని ఎందుకు దాచుకోవాల్సి వచ్చిందంటే? అదో ఫ్రాంక్ వీడియో. మా కజిన్స్ నన్ను సరదాగా ఆట పట్టించేందుకు తీశారు. అలా చేయాలని చెప్పి మరీ ఆవీడియో తీశారు. నాకు చెప్పే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కానీ, ఈ వీడియోను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంత మంది నన్ను టార్గెట్ చేసిన మాట్లాడుతున్నారు. కానీ, తప్పు నాదే. ఎవరినీ నేను తప్పుపట్టను. ఇప్పటికైనా ఆ వీడియో మీద వస్తున్న ఈహాగానాలకు ఫుల్ స్టాఫ్ పడుతుందని భావిస్తున్నాను” అని విశాల్ వెల్లడించారు.






విడుదలకు రెడీ అవుతున్న‘రత్నం’


ప్రస్తుతం విశాల్ ‘రత్నం’ అనే సినిమాలో నటిస్తున్నారు. హరి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. స్టోన్ బెంచ్‌ ఫిలిమ్స్‌, జీ స్టూడియోస్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.  ఇది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ‘తుప్పరివాలన్2’లో కూడా విశాల్ నటిస్తున్నారు.






Also Read: కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటీ? ‘సలార్’, ‘డంకీ’ మేకర్స్ ఆ పనికి పాల్పడ్డారా? ‘యానిమల్’ నిర్మాత ఏం చెప్పారు?