ఆ సీన్లు నచ్చలేదు - ‘యానిమల్’ మూవీపై బాబీడియోల్ అన్న సన్నీ డియోల్ షాకింగ్ కామెంట్స్
దేశ వ్యాప్తంగా ‘యానిమల్‘ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇదే సినిమా గురించి చర్చ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించారు. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పలువురు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే ‘యానిమల్’ సినిమాపై బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రవితేజ ‘ఈగల్‘ పేరు మారింది, అక్కడ ‘సహదేవ్’ టైటిల్‌తో విడుదల!
టైగర్ నాగేశ్వర్ రావు’తో పెద్ద డిజాస్టర్ అందుకున్న రవితేజ ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు.  దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో కలిసి ‘ఈగల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో కావ్య థాపర్ కనిపించబోతోంది. ఇప్పటికే షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతోంది. తాజాగా ‘ఈగల్’ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ పేరు మార్చుతున్నట్లు ప్రకటించారు. అయితే, కేవలం హిందీలోనే ఈ మార్పు ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీలో ‘సహదేవ్’ పేరుతో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'సలార్’ మరో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ప్రభాస్‌‌ను ‘డార్లింగ్’ అని ఎందుకంటారో అర్థమైంది - పృథ్వీరాజ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’. ఈనెల 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఈ సినిమాతో పాటు హీరో ప్రభాస్ గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


కళ్యాణ్ రామ్ 'డెవిల్' చూసిన 'దిల్' రాజు - 'బింబిసార' సెంటిమెంట్ రిపీట్!
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'డెవిల్'. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... ఉప శీర్షిక. ఇదొక పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్. అభిషేక్‌ నామా నిరించారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ పరిచయం అవుతున్నారు. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. 'డెవిల్'ను తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాత 'దిల్' రాజు చూశారని తెలిసింది. సినిమా యూనిట్ ఆయన కోసం స్పెషల్ షో వేసింది. షో పూర్తి అయిన తర్వాత బావుందని హీరో, దర్శక నిర్మాతను 'దిల్' రాజు మెచ్చుకోవడం మాత్రమే కాదు... సినిమా రైట్స్ కూడా తీసుకుంటానని చెప్పారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


శేష్, శృతి... ఆ పరదాలు తొలగించేది ఎప్పుడంటే?
కథానాయకుడు అడివి శేష్, అగ్ర కథానాయిక శృతి హాసన్ జంటగా ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. ఇటీవల సినిమాను అనౌన్స్ చేశారు. అడివి శేష్, శృతి హాసన్ నటిస్తున్న తొలి చిత్రమిది. ఆల్రెడీ హీరో హీరోయిన్ల ప్రీ లుక్స్ విడుదల చేశారు. రెండు పోస్టర్లలోనూ కేవలం నటీనటుల కళ్ళు మాత్రమే కనిపించాయి. ఇంటెన్స్ అండ్ ఫైర్సీ లుక్స్ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేశాయి. మరి, ఆ పరదాలు ఏమిటి? వాటి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అంటే... ఈ నెల 18వ తేదీ వరకు వెయిట్ చేయాలి. అడివి శేష్, శృతి హాసన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్, సినిమా టైటిల్ ఈ నెల 18న విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)