Telugu Bigg Boss 7: ‘బిగ్ బాస్ సీజన్ 7’లో ఫైనల్ వీక్ కావడంతో కేవలం ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. దీంతో ఎక్కువగా ఫన్ లేకుండా హౌజ్ అంతా సైలెంట్ అయిపోయింది. దీంతో ప్రేక్షకులు బోరింగ్ ఫీల్ అవుతున్నారని కంటెస్టెంట్స్‌ను హెచ్చరించాడు బిగ్ బాస్. అయినా వారి వైఖరి ఏ మాత్రం మారకపోవడంతో బిగ్ బాసే ఫన్ టాస్కులు ఇవ్వడం మొదలుపెట్టాడు. తాజాగా బిగ్ బాస్‌లో ఫేమస్ టాస్కులను రీక్రియేట్ చేశారు కంటెస్టెంట్స్. ఇప్పుడు హౌజ్‌లో మర్చిపోలేని కొన్ని సంఘటనలను రీక్రియేట్ చేయమని, తోటి కంటెస్టెంట్స్‌ను ఇమిటేట్ చేయమని బిగ్ బాస్ ఆదేశించారు. తోటి కంటెస్టెంట్స్‌ను ఇమిటేట్ చేసే అలవాటు అర్జున్.. ఈ టాస్కులో ఇచ్చిపడేశాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
సీన్స్ రీక్రియేషన్..
‘‘ఈ సీజన్‌లో జరిగిన, ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన కొన్ని ఐకానిక్ సన్నివేశాలను రీక్రియేట్ చేసే అవకాశం బిగ్ బాస్ మీ అందరికీ ఇస్తున్నారు. మీరు పోషించాల్సిన పాత్రలు ఇతరులవి’’ అంటూ బిగ్ బాస్.. ఈ ఫన్ టాస్క్ గురించి వివరించారు. ముందుగా కెప్టెన్సీ టాస్క్ సమయంలో అమర్, ప్రియాంక.. కెప్టెన్సీ కోసం పోటీపడుతున్నప్పుడు అమర్ ప్రవర్తన ఎలా ఉందో రీక్రియేట్ చేశాడు అర్జున్. గౌతమ్‌గా అమర్ వ్యవహరించగా.. రతిక పాత్రను ప్రియాంక పోషించింది. అమర్.. అర్జున్‌పై బాల్స్ విసురుతున్నట్టు యాక్ట్ చేయగా.. అర్జున్ బ్రతిమిలాడుకున్నాడు. అచ్చం అమర్‌లాగానే అరిచాడు కూడా. దీంతో ఈ రిక్రియేషన్ టాస్క్ ప్రోమో చూసి ప్రేక్షకులంతా నవ్వుకున్నారు.
కన్‌ఫ్యూజ్ అయిన శివాజీ..
ఆ తర్వాత శివాజీ.. కాఫీ కోసం బిగ్ బాస్‌తో గొడవపడిన సన్నివేశాన్ని రీక్రియేట్ చేయమని బిగ్ బాస్ తెలిపారు. ఈ సన్నివేశంలో శివాజీలాగా ప్రియాంక నటించింది. పల్లవి ప్రశాంత్‌లాగా యావర్, యావర్‌లాగా పల్లవి ప్రశాంత్ మారారు. ముందుగా ప్రియాంక.. కెమెరా ముందుకు వచ్చి ‘‘కాఫీ అయిపోయింది బిగ్ బాస్. కాఫీ పంపవయ్యా నీకు దండం పెడతా. ఈ గొడవ ఏంటి నాకు’’ అని శివాజీలాగా మాట్లాడే ప్రయత్నం చేసింది ప్రియాంక. బిగ్ బాస్ కాఫీ పంపించు అని చెప్తూ అటు, ఇటు తిరిగింది. తన వెనకాలే ప్రశాంత్, యావర్ కూడా తిరిగారు. కాఫీ పంపడం లేదనే కోపంతో మైక్ విసిరేసి వెళ్లి మంచంపై పడుకుంది ప్రియాంక. దీంతో ‘‘శివాజీ మైక్ ధరించండి’’ అని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఆ అనౌన్స్‌మెంట్ విన్న తర్వాత శివాజీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తాను మైక్ వేసుకొని ఉన్నాను కదా అని ఏంటిది అని కన్‌ఫ్యూజ్ అయ్యాడు. అది చూసి యావర్, ప్రశాంత్ నవ్వుకున్నారు.
అర్జున్ ఇమిటేషన్ అదుర్స్..
చివరి నామినేషన్స్ సమయంలో అమర్, పల్లవి ప్రశాంత్‌ల మధ్య జరిగిన గొడవను అర్జున్, శివాజీ రీక్రియేట్ చేశారు. పల్లవి ప్రశాంత్‌గా అర్జున్, అమర్‌దీప్‌గా శివాజీ వ్యవహరించారు. అర్జున్ మాట్లాడుతూ ఉండగానే.. శివాజీ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. అయితే ప్రశాంత్ ఎలా అయితే ‘‘అన్నా ముందు నన్ను చెప్పనివ్వు. నువ్వు మాట్లాడతావు. నన్ను మాట్లాడనివ్వవు’’ అని అచ్చుగుద్దినట్టు ఇమిటేట్ చేశాడు అర్జున్. దీంతో శివాజీ కూడా తన నటనతో రెచ్చిపోయాడు. అమర్‌లాగా అర్జున్‌తో గొడవపడడానికి ముందుకొచ్చాడు. వారిద్దరూ సీన్‌ను రీక్రియేట్ చేస్తుండగానే.. శివాజీ పాత్ర పోషిస్తున్న ప్రియాంక జోక్యం చేసుకొని వారిద్దరినీ ఆపే ప్రయత్నం చేసింది.
Also Read: అశ్వినీని పెళ్లి చేసుకుంటా - మనసులో మాట బయటపెట్టేసిన యావర్, శ్రీముఖి షాక్!