Prithviraj Sukumaran On Salaar Movie And Prabhas: పాన్ ఇడియన్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’. ఈనెల 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఈ సినిమాతో పాటు హీరో ప్రభాస్ గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు.
ప్రభాస్ ను డార్లింగ్ అని ఎందుకు అంటారో అర్థం అయ్యింది!
‘సలార్’ సినిమా సమయంలో ప్రభాస్ తో మంచి అనుబంధం ఏర్పడిందని సుకుమారన్ తెలిపారు. ఆయనతో ఉండే వాళ్లను ఎంతో ప్రేమగా చూసుకుంటారని వెల్లడించారు. “ఈ చిత్రంలో నేను వరదరాజ మన్నార్ గా నటించిస్తున్నాను. ప్రభాస్ దేవాగా కనిపిస్తారు. ఈ సినిమాలో నటించడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. నా కెరీర్ లోనే ఈ సినిమా లాంటి కథను చూడలేదు. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంటుందని మాకు నమ్మకం ఉంది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. నేను తరచుగా ఆయనతో మాట్లాడతాను. సినిమా సెట్ లో ప్రభాస్ ను అందరూ ఇష్టపడుతారు. అందరికీ చక్కటి భోజనం ఇంటి నుంచే తెప్పిస్తారు. తన చుట్టూ ఉండే వాళ్లను హ్యాపీగా చూసుకుంటారు. అందుకే ఆయనను అందరూ డార్లింగ్ అని పిలుస్తారని అర్థం అయ్యింది” అని వెల్లడించారు.
చూసింది తక్కువ, చూడాల్సింది ఎంతో!
‘సలార్’ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు సుకుమార్. ఈ సినిమాతో తన కల నెరవేరిందన్నారు. “’సలార్’తో నా కల నెరవేరింది. ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్ లో ప్రేక్షకులు చూసింది చాలా అంటే చాలా తక్కువ. ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే ఉండదు. భావోద్వేగాలతో నిండి ఉంటుంది. థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకులు ఈ సినిమా చూసి చాలా గొప్ప సినిమా చూశామనే భావనతో బయటకు వెళ్లారు. ‘సలార్’ రెండో భాగం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని తెలిపారు.
‘సలార్’ మరో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’
ఇక ‘సలార్’ సినిమా హాలీవుడ్ మూవీ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’తో పోల్చారు సుకుమారన్. ఇప్పటి వరకు ‘సలార్’ మూవీ ‘కేజీఎఫ్’ సినిమాల మాదిరిగా ఉంటుందని అందరూ భావించారు. కానీ, ఈ మూవీ అంతకు మించి ఉంటుందని తెలిపారు. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలిపారు. హాలీవుడ్ సంచలన సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ మాదిరిగా ఉంటుందని చెప్పారు.
వరుస సినిమాలతో సుకుమార్ బిజీ
ఈ ఏడాది తనకు మంచితో పాటు చెడును కూడా మిగిల్చిందని సుకుమారన్ తెలిపారు. “ఈ ఏడాది జూన్‌లో నా మోకాలు విరిగింది. కొద్ది రోజుల పాటు మంచానికే పరిమితం అయ్యాను. మోహన్‌లాల్ ‘లూసిఫర్’ చిత్రానికి దర్శకత్వం వహించాను. ఆ తర్వాత ‘L2E’ కోసం చాలా కాలంగా పనులు మొదలు పెట్టాం. ఇప్పుడు ఆ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రతిష్టాత్మక ‘సలార్’లోనూ భాగం అయ్యాను. ఈ సినిమాతో ఏడాది ముగుస్తుందని భావిస్తున్నాను. ‘L2E’ కోసం లేహ్, ఢిల్లీ, సిమ్లాలో ఒక షెడ్యూల్‌ని షూట్ చేశాను. అటు ‘ది గోట్ లైఫ్’ షూట్ కూడా కంప్లీట్ చేశాను. ‘బడే మియాన్ చోటే మియాన్’ అనే హిందీ సినిమా చేస్తున్నాను.
Read Also: ఆకాశంలో అద్భుతం - ఆరు హెలికాప్టర్లతో ప్రభాస్‌కు ఎయిర్ సెల్యూట్, ‘సలార్’ క్రేజీ వీడియో!