Cinematic Air Salute to Rebel Star Prabhas: పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సలార్’. దిగ్గజ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా, అనుకున్న స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం కొనసాగడం లేదు.    


ప్రభాస్‌కు ఫ్యాన్స్ అదిరిపోయే సెల్యూట్


‘సలార్’ విడుదలకు కనీసం వారం రోజులు కూడా లేదు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ట్రైలర్ తోపాటు ఓ పాటను మాత్రమే విడుదల చేశారు మేకర్స్. ఇతరత్రా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెద్దగా లేవు. చిత్రబృందం నుంచి హడావిడి లేకపోయినా, ఆయన అభిమానులు మాత్రం మూవీకి మరింత క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన ఫ్యాన్స్ కెనడాలో వినూత్న రీతిలో సినిమాటిక్ ఎయిర్ సెల్యూట్ చేశారు. ఏకంగా ఆరు హెలీకాఫ్టర్లతో రెబల్ స్టార్ కు సెల్యూట్ చేయించారు. టొరొంటోలోని పచ్చని మైదానంలో ప్రభాస్ భారీ పోస్టర్ ఏర్పాటు చేశారు. అదే సమయంలో 6 హెలికాఫ్టర్లు గాల్లోకి ఎగిరాయి. ఒక్కో హెలికాఫ్టర్ కు ‘సలార్’లోని ఒక్కో అక్షరాన్ని అంటించి వాటితో ఎయిర్ సెల్యూట్ చేయించారు.  


వీడియోను షేర్ చేసిన హొంబలే ఫిలిమ్స్


ప్రభాస్ అభిమానులు ఎంతో కష్టపడి ఈ వీడియోను రూపొందించారు. తాజాగా ఈ వీడియోను ‘సలార్’ నిర్మాణ సంస్థ హొంబలే ఫిలిమ్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ‘ఏ సినిమాటిక్ ఎయిర్ సెల్యూట్ టు రెబల్ స్టార్ ప్రభాస్’ అంటూ విడుదల షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ప్రభాస్ అభిమానులను బాగా అలరిస్తోంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ అభిమానుల ఎఫర్ట్ ను అందరూ అభినందిస్తున్నారు.



సినిమాపై అంచనాలు పెంచిన ట్రైలర్, పాట


ఇక రీసెంట్ గా 'సలార్​' సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్, పాట సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. ట్రైలర్ కు సోషల్ మీడియాలో బాగా క్రేజ్ దక్కింది. తెలుగు వెర్షన్ ట్రైలర్ యూట్యూబ్ లో సుమారు 45 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ‘సూరీడే’ అనే పాట కూడా భారీగా వ్యూస్ అందుకుంది. ఈ పాట తెలుగు వెర్షన్ 7 మిలియన్లకు పైగా మంది చూశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను హిరనీ ఇవాటురి అద్భుతంగా ఆలపించారు. రవి బస్రూర్ సంగీతం అద్భుతంగా ఆకట్టుకుంటోంది.


ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. పలుమార్లు వాయిదా పడ్డ తర్వాత, తొలి భాగం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. హోంబలే ఫిల్మ్స్‌ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు, టిన్నూ ఆనంద్‌, ఈశ్వరీరావు, పృథ్వీ రాజ్ సుకుమారన్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Read Also: హ్యాపీ బర్త్‌ డే అడివి శేష్ - ‘సినిమా’ అతడి గుండె చప్పుడు, అమెరికా వదిలేసి అందరివాడయ్యాడు!