Krishna Mukunda Murari Serial Today Episode
ముకుంద: నాకు వద్దు నాకేం మందులు వద్దు నన్ను ఒంటరిగా వదిలేయ్.. అసలు నిన్ను చూస్తుంటేనే నాకు చంపేయాలి అన్నంత కోపం వస్తుంది.
కృష్ణ: చావాలి అనే దానికంటే చంపాలి అనేది కొంచెం నయం. బతికే ఉంటావు. బతికి ఉంటే ఇవాళ కాకపోయినా రేపు అయినా మంచిగా ఆలోచిస్తావు.
ముకుంద: మా అత్తయ్య ఇప్పటికైనా మురారిని నాకు ఇచ్చే పెళ్లి చేస్తుంది. గతం గుర్తొచ్చింది కదా అని సంతోషించకు. నేను బతికేదే మురారి కోసం.
కృష్ణ: నేను బతకుతున్నది ఏసీపీ సార్ కోసమే.
ముకుంద: అదే అయితే నీ బతుకుకు అర్థం లేదు. ఎందుకు అంటే మురారితో మా అత్తయ్య.
కృష్ణ: మాట్లాడకు ముకుంద.. మీరు ఆడమన్నట్లు అంతా ఆడటానికి ఏసీపీ సార్ ఏమైనా చంటిపిల్లాడు అనుకుంటున్నారు. నిన్ను వేరు, ఇవాళ వేరు అనవసరంగా కలలు కని జీవితాన్ని నాశనం చేసుకోకు..
ముకుంద: చూడు కృష్ణ.. నీకు నేను ఇదే చెప్తున్నా.. మురారికి గతం గుర్తొచ్చినా నీతో ఉంటాడు అని ఆశలు పెంచుకోకు.
కృష్ణ: ఏసీపీ సార్ నీకు రాసిపెట్టి లేరు అని నీ అంతరాత్మని అడుగు చెప్తుంది. నిజంగా నీ ఏసీపీ సార్ నీ వాడు కావాలి అని దేవుడు అనుకుని ఉంటే ఏసీపీ సార్‌కి గతం గుర్తు తెచ్చేవాడా.. నీ భవిష్యత్ నీ జీవితం.. నీ ప్రయాణం అన్నీ ఒకరి తోనే.. అది ఆదర్శ్ తో.. ఆదర్శ్ ఎక్కడ ఉన్నా పట్టుకొని వచ్చే బాధ్యత నాది.
ముకుంద: నోర్ముయ్ కృష్ణ..
కృష్ణ: వస్తాను.. ఏసీపీ సార్ లేచారు ఏమో చూస్తాను..(ఏసీపీ సార్‌తో ముకుంద గురించి ఏం చెప్పకూడదు అనవసరంగా డిస్ట్రబ్ అవుతారు).
ఇక శకుంతల కృష్ణ కోసం ఎదురు చూస్తుంది.. ఇంతలో రేవతి అక్కడి వచ్చి భయపడకు మా ఇంట్లోనే ఉంటుంది నేను పంపిస్తాను లే అని అంటుంది. ఇక ముకుందతో మురారి పెళ్లి అయితే నా బిడ్డ భవిష్యత్ ఏంటి అని శకుంతల రేవతిని అడుగుతుంది. రేవతి శకుంతలని సర్దిచెప్తుంది..
మరోవైపు మురారి గతంలో కృష్ణ తన ఫొటోలు ఇచ్చి మూడ్ ఆఫ్ అయినప్పుడు చూసుకోమని చెప్పిన మాటలను మురారి తలచుకొని నవ్వుకుంటాడు.
మురారి: మనసులో.. నాకు నీ మీద ఉన్న ప్రేమే గతం గుర్తొచ్చేలా చేసింది. రాత్రి పెద్దమ్మ దోషులెవరో పట్టుకోమని చెప్పింది. కానీ పెద్దమ్మకు తెలీదు ఒక రెండు రోజుల్లో వాళ్లని పట్టుకొని లోపల వేయిస్తాను. కృష్ణ చిన్నాన్న బయటకు తీసుకొస్తాను. అప్పుడు నిజం ఏంటో పెద్దమ్మ ముందు నిరూపిస్తాను.
కృష్ణ: ముకుంద ఏంటి ఇంత పంతానికి పోతుంది. మూర్ఖత్వమో అమాయకత్వమో ఏం అర్థం కావడం లేదు. ఏబీసీడీల అబ్బాయి లేచాడో లేదో అసలే నేనే ఏబీసీడీల అబ్బాయి అని పిలిచి చాలా రోజులు అవుతుంది. ఇన్నాళ్లు సార్ సార్ అనలేక చచ్చిపోయాను. తనేమో వేణి గారు అంట.. ఇంత ప్రేమ ఉందని నాకు ముందే తెలిస్తే ఇంత దూరం వచ్చుండేది కాదు కదా సార్
మురారి: కృష్ణ
కృష్ణ: చెప్పండి ఏసీపీ సార్... మనసులో.. దోషులు ఎవరో పట్టుకోకపోతే వచ్చే శుక్రవారమే ఏసీపీ సార్‌కి ముకుందతో పెళ్లి.. అయినా ఈ విషయం ఇప్పుడు చెప్పకూడదు. చెప్తే అనవసరంగా బాధపడతారు.
మురారి: ఏం ఆలోచిస్తున్నావు.. సరే ఫొటోలు అన్నీ సర్దు నేను రెడీ అయి వస్తాను.. ఈరోజు ఆఫీస్‌కు వెళ్లాలి. కమీషనర్ గారిని కలిసి అన్నీ విషయాలు మాట్లాడాలి కదా.. ఇప్పటి నుంచి ఒక్క క్షణం కూడా వృథా చేయకూడదు.
ఇక కృష్ణ ఫొటోలు అన్నీ సర్దేస్తుంది. ఇక మురారి రెడీ అయి వస్తాడు. కృష్ణ మురారి తల తుడుస్తుంది. మరోవైపు నందిని కిచెన్‌లో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి ఏం అయింది అని అడిగితే.. రాత్రి మురారి హీరోలా మాట్లాడాడు అని మురిసి పోతుంది. ఇక భవాని కిందకి వస్తుంది. ముకుందా లేచిందా అని అడుగుతుంది. ఎవరూ నోరు కదపకపోవడంతో రాత్రి అంత జరిగినా ఎవరూ పట్టించుకోలేదా.. అసలు మీరు అంతా అయిన వాళ్లేనా అని తిడుతుంది. ఇంతలో ముకుంద కిందకి వస్తుంది.
ముకుంద: వాళ్లని అని ఏం ప్రయోజనం అత్తయ్య.. అవును అత్తయ్య నేనే చాలా దురదృష్టవంతురాలిని.
భవాని: అలా అనుకోకు ముకుంద నీకు అదృష్టం పట్టనుంది అనుకో.
ముకుంద: భలే వారు అత్తయ్య అదృష్టం అనే మాటకు నా బతుకుకు అర్థం తెలుసా.. కానీ ఒక విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని.. నా మీద ఎలాంటి సానుభూతి ఇంట్లో వాళ్లకి లేకపోయినా.. ఎలాంటి ప్రేమ లేకపోయినా.. నాకు మీరు ఉన్నారు అత్తయ్య. కొండంత అండగా మీరున్నారు. నాకు అది చాలు ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. నాకు అది చాలు.
భవాని: బాధ పడకు ముకుంద. ఇక్కడ మంది కాదు ముఖ్యం గుండె ధైర్యం ముఖ్యం.. సరే సరే ఇప్పుడు అంతా ఓకే కదా..
ముకుంద: బాగానే ఉంది అత్తయ్య.
మధు: ముకుంద టైంకి కృష్ణ రియాక్ట్ అవ్వకపోతే హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సి వచ్చేది.
భవాని: ఏ గౌతమ్ లేడా.. ఎప్పుడు చూడు ఆ కృష్ణ అనే..
ఇంతలో కృష్ణ, మురారి గిల్లిగజ్జాలు ఆడుతూ కిందకి వస్తుంటారు.. దాన్ని చూసి రేవతి వాళ్లు మురిసిపోతారు. ఇంతలో మురారి ఆఫీసుకు వెళ్తానని చెప్పి తన పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇక కృష్ణ కూడా తనతోనే వస్తుందని.. జైలుకు వెళ్లి వాళ్ల చిన్నాన్నని కలుస్తామని చెప్తాడు. తర్వాత డాక్టర్‌ని కలుస్తామని చెప్తాడు. ఆపరేషన్ ఎవరు చేయించారో వాళ్లకు ఐడియా ఉంటుంది కదా అని మురారి అంటాడు. మరోవైపు ముకుంద చాలా టెన్షన్ పడుతుంది. అది గమనించిన కృష్ణ ఎలా ఉంది ముకుంద అని అడుగుతుంది. ఏంటి కంగారు పడుతున్నావు అని అడుగుతుంది. ఇక మురారి, కృష్ణ ఇద్దరూ స్టార్ట్ అవుతారు. మరోవైపు ముకుంద చాలా టెన్షన్ పడుతుంది. మురారి ఎంక్వైరీలో నిజాలు తెలిస్తే తన అత్తయ్య తనను క్షమిస్తుందా అని కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: శైలేంద్రని షూట్ చేసిన మహేంద్ర, వసుధార బాధ్యత ఇకపై అనుపమదే!