Happy birthday Adivi Sesh: హీరో అడవి శేష్. ప్రస్తుతం హీరోలలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. సరికొత్త కథలతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు పోషించిన శేష్, ఇప్పుడు హీరోగా మంచి పాపులారిటీ సంపాదించాడు. తన సినిమాలకు తనే కథలు రాసుకోవడంతో పాటు దర్శకుడిగానూ రాణిస్తున్నాడు.


ఒక్క ముక్కలో చెప్పాలంటే అడవి శేష్‌కు సినిమా అంటే పిచ్చి. అందుకే, అమెరికా లైఫ్‌ను కాదనుకుని.. టాలీవుడ్ వచ్చేశాడు. కష్టపడ్డాడు.. అన్ని రంగాల్లో పట్టు సాధించాడు. ఇప్పుడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. టాలెంట్ ఎక్కడున్నా అక్కున చేర్చుకోవడం తెలుగు ప్రేక్షకుల నైజం. అందుకే, అడవి శేషు కూడా అందరివాడు అయ్యాడు. విభిన్న సినిమాలతో అదరగొడుతున్నాడు. డిసెంబరు 17న అడవి శేష్ పుట్టిన రోజు. అతడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.


సినిమాల కోసం ఇండియాకు..


1985 డిసెంబర్ 17న అడవి శేష్ జన్మించారు. పుట్టింది ఇక్కడే అయినా, అమెరికాలోనే పెరిగారు. అక్కడే చదువుకున్నాడు. తన బంధువు సినిమా పరిశ్రమలో ఉండటంతో ఆయనకు కూడా సినిమాలపై ఆసక్తి పెరిగింది. సినిమాల్లో నటించాలనే కోరికతోనే అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశాడు. కొన్ని సినిమాల్లో నటించేందుకు ఆడిషన్స్ కు వెళ్లాడు. కానీ, చాలామంది తిరస్కరించారు. అయినా, తను వెనక్కి తగ్గలేదు. యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. సినిమా నిర్మాణంలోనూ ట్రైనింగ్ పొందాడు.


‘సొంతం’ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టారు. ఇందులో చిన్న పాత్ర చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ‘పంజా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బలుపు’, ‘రన్ రాజా రన్’, ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. ‘బాహుబలి’ తొలి భాగంలో బల్లాల దేవుడి కొడుకుగా కనిపించాడు.


‘క్షణం’, ‘ఊపిరి’, ‘అమీ తుమీ’, ‘గూఢచారి’, ‘ఓ బేబీ’, ‘ఎవరు’ సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్ 2’, ‘మేజర్’ సినిమాలతో హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాలకు ఆయనే కథను అందించాడు. కర్మ’, ‘కిస్’ సినిమాలతో ప్రయోగాలు కూడా చేశాడు. ఈ రోజు అడివి శేష్ 38వ వసంతంలోకి అడుగు పెట్టాడు. 


పెరిగింది, చదివింది అమెరికాలోనే   


అడివి శేష్ చిన్నప్పుడే ఆయన కుటుంబం అమెరికాకు వెళ్లింది. కాలిఫోర్నియాలో పెరగడంతో పాటు బెర్క్లీలో చదువుకున్నారు.  అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో CA పట్టా పొందారు.  


అడవి శేష్ అసలు పేరు ఏంటంటే?


అడవిశేష్ అసలు పేరు అడివి శేష్ సన్నీ చంద్ర. సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత తన పేరును షార్ట్ గా మార్చుకున్నారు.  


ఫ్యామిలీతో గడపడం ఇష్టం


అడివి శేష్ వీలైనంత వరకు కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతారు. పేరెంట్స్ తో చాలా ప్రేమగా ఉంటారు. ఖాళీ సమయం దొరికితే వారితోనే స్పెండ్ చేస్తారు. 


రచయితగానూ రాణిస్తున్న శేష్  


అడవి శేష్ నటుడిగానే కాకుండా, రచయితగా, దర్శకుడిగానూ రాణిస్తున్నాడు.  


పర్యావరణ కార్యకర్తగా..  


అడవి శేష్ కు పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో పోరాడుతున్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకు జంతు ప్రేమికుడు. జంతువుల నుంచి తయారైన వస్తువులను, దుస్తులను ఉపయోగించరు.






Read Also: ఆమె లేకుండా ఎలా చెబుతా? మలైకాతో పెళ్లిపై అర్జున్ కపూర్ కామెంట్స్