Arjun Kapoor About Marriage With Malaika Arora: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, నటి మలైకా అరోరా కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. తన కంటే వయసులో 12 ఏళ్లు పెద్దదైన మలైకాతో గత 5 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహాంపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ వచ్చాయి. అయినప్పటికీ ఏనాడు స్పందించలేదు. తాజాగా ఈ ట్రోలింగ్స్ తో పాటు మలైకాతో పెళ్లి గురించి కీలక విషయాలు వెల్లడించాడు అర్జున్ కపూర్. సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్‌ కరణ్‘లో పాల్గొన్న అర్జున్, చాలా అంశాల గురించి మాట్లాడారు. 


ఆ విమర్శల గురించి పెద్దగా పట్టించుకోను!


మలైకాతో ప్రేమ విషయంలో వచ్చిన విమర్శలు, ట్రోలింగ్ గురించి అర్జున్ స్పందించాడు. సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే, ఆ విమర్శలను ఎలా స్వీకరిస్తాం అనేది చాలా ముఖ్యం అన్నారు. తప్పుడు విమర్శలు చేసే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎదుటి వ్యక్తి గురించి ఏదో ఒకటి రాసి అటెన్షన్ డైవర్ట్ చేసే వారి గురించి ఆలోచించడమే వేస్ట్ అన్నారు. అడ్డగోలుగా మాట్లాడే వారిని పట్టించుకోవడం కంటే సైలెంట్ గా ఉండటమే మంచిదన్నారు. సోషల్ మీడియాలో లైకుల కోసం చెత్త రాసేవాళ్లే మనం కనిపిస్తే ఫోటోల కోసం ఎగబడతారని అభిప్రాయపడ్డారు.


మలైకాతో పెళ్లి గురించి ఏమన్నారంటే?


అటు నటి మలైకా అరోరాతో పెళ్లి గురించి అర్జున్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనదని చెప్పిన ఆయన, ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. “మలైకా లేకుండా ఈ షోలో కూర్చొని పెళ్లి గురించి, ఫ్యూచర్ గురించి మాట్లాడ్డం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. పెళ్లి అనేది చాలా సంతోషకరమైన విషయం. మేము పెళ్లి చేసుకోవాలి అనుకున్న రోజు ఇద్దరం వచ్చి మాట్లాడుతాం” అని చెప్పారు.


50 ఏళ్ల మలైకాతో ప్రేమాయణం


ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కొడుకు, నటుడు అయిన అర్జున్ కపూర్ సుమారు 50 ఏళ్ల మలైకాతో ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఉంటున్నారు. పార్టీ, టూర్లలో షికార్లు చేస్తున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కొద్ది రోజుల క్రితం అర్జున్, మలైకాతో దూరంగా ఉంటున్నాడనే వార్తలు వినిపించాయి. నటి కుషా కపిలాతో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపించింది. అయితే, కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా మలైకాకు బర్త్ డే విషెస్ చెప్పి ఈ వార్తలు అవావస్తవం అని చెప్పకనే చెప్పాడు.  


బ్రేకప్ రూమర్స్ పై స్పందించిన మలైకా  


అటు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మలైకా బ్రేకప్ రూమర్స్ గురించి స్పందించింది. “నా వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తుతం చర్చించాలి అనుకోవడం లేదు. మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుతాను. నేను ఇప్పుడు ప్రత్యేకం చెప్పాల్సింది ఏమీ లేదు. ఇప్పటికే చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేశాను” అని వెల్లడించింది. మలైకా గతంలో నటుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు అర్హాన్ అనే 16 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కొన్ని విభేదాల కారణంగా 2017లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.


Read Also: అబ్బా, అనిపిస్తోన్న అబ్రార్ ఎంట్రీ సాంగ్, యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘యానిమల్’ - 24 గంటల్లో అన్ని వ్యూసా!