Bobby Deol's Animal entry song Jamal Kudu Song: రణ్‌బీర్‌ కపూర్ హీరోగా న‌టించిన తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవ‌లం 12 రోజుల్లోనే రూ.757 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్రంలో రణబీర్, బాబీ డియోల్, రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


24 గంటల్లో 14 మిలియన్ల వ్యూస్


ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ చేసింది చిన్న రోల్ అయినా, మూవీకి పెద్ద అసెట్ గా మారింది. అబ్రార్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక ఆయన ఎంట్రీ టైమ్ లో వచ్చే వచ్చే జ‌మ‌ల్ కుడు సాంగ్ సోషల్ మీడియాలో మార్మోగుతోంది. బాబీ తన పెళ్లిలో మహిళలు పాట పాడుతుండగా, మందు గ్లాసు పట్టుకుని బంధు మిత్రులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. జ‌మ‌ల్ జ‌మాలో అంటూ సాగే ఈ పాట ఇప్పటికే బాగా పాపులర్ అయ్యింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన పూర్తి వీడియోను టి-సిరీస్ విడుదల చేసింది. ఈ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. 24 గంటల్లో ఏకంగా 14 మిలియన్ల వ్యూస్ సాధించింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.



దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న ఇరానియన్ సాంగ్  


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘జమాల్ కుడు’ ఓ ఇరానియన్ పాట.  ప్రముఖ ఇరానియ‌న్ క‌వి బిజాన్ స‌మాంద‌ర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ పాట ఇరాన్ లో జరిగే పెళ్లి వేడుకలలో పెట్టడం విశేషం. ఈ పాటను 1977లో అనౌశిర్వాన్ రోహాని అనే సంగీత దర్శకుడు రీమిక్స్ చేశాడు. లేటెస్టుగా ‘యానిమల్’ మూవీలో దర్శకడు సందీప్ ఈ రీమిక్స్ పాటనే వాడుకున్నాడు. ఈ మూవీ సంగీత దర్శకుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, మేఘ‌న నాయుడు, ఐశ్వ‌ర్య‌ దాస‌రి, అభిక్య‌, స‌బీహతో పాటు కొందరు చిన్నారులతో ఈ పాటను పాడించారు. జానపద, సంప్రదాయాల కలబోతగా ఉన్న ఈ పాట దేశ వ్యాప్తంగా సంగీత ప్రియులను అలరిస్తోంది.   


యానిమల్ మూవీ గురించి..


సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ తో కూడిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల అయ్యింది. ఈ మూవీపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదరువుతున్నాయి.      


Read Also: ఆ పాట విని ఫ్యూజులు ఎగిరిపోయాయ్, 'నా పెట్టే తాళం' సాంగ్ పై సత్యశ్రీ షాకింగ్ కామెంట్స్