Yash New Movie : ఒక సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత.. ఇక హీరోలు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. తమ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ప్రత్యేక దృష్టిపెడుతూ.. ప్రతీ సినిమాతో దేశవ్యాప్తంగా ఆడియన్స్‌ను అలరించాలనే ఒత్తిడి వారిపై ఏర్పడుతుంది. అందుకే కన్నడ స్టార్ యశ్ కూడా తొందరపడి సినిమాలు చేయకుండా తన అప్‌కమింగ్ చిత్రాల విషయంలో మెల్లగా అడుగులేస్తున్నాడు. తాజాగా తన తరువాతి సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో యశ్‌తో జతకట్టడానికి ఇద్దరు ముద్దుగుమ్మలు సిద్ధమవుతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాయి పల్లవి, శృతి హాసన్‌లతో..
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ నటిస్తున్న చిత్రమే ‘టాక్సిక్’. ఈ వెరైటీ టైటిల్ రివీల్ చేయగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం యశ్.. తన పూర్తి ఫోకస్ ఈ సినిమాపై పెట్టడంతో రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఇంతలోనే ఇందులో హీరోయిన్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలయ్యింది. ‘టాక్సిక్’లో యశ్‌కు జోడీగా శృతి హాసన్, సాయి పల్లవి నటించనున్నాని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సమయంలో ఇలాంటి ఒక రూమర్ రావడం తమ ఫ్యాన్స్‌ను సంతోషపెడుతోంది.
రెండేళ్ల తర్వాత కమ్‌బ్యాక్..
సాయి పల్లవి హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చి చాలాకాలమే అయినా తను నటించిన సినిమాలు మాత్రం చాలా తక్కువ. దానికి కారణమేంటో ప్రేక్షకులకు తెలిసిందే. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే.. ఎంత పెద్ద సినిమా అయినా రిజెక్ట్ చేయడానికి సాయి పల్లవి వెనకాడదు. అందుకే కమర్షియల్ కథలో అయినా తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది. అందుకే దాదాపు రెండేళ్లు టాలీవుడ్‌కకు దూరంగా కూడా ఉంది. మళ్లీ ఇటీవల చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘తండేల్’తో కమ్‌బ్యాక్ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా.. ఇంతలోనే సాయి పల్లవి ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు యశ్ ‘టాక్సిక్’లో కూడా తనే హీరోయిన్ అని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
‘సలార్’లో ప్రభాస్‌తో..
ఇక శృతి హాసన్ విషయానికొస్తే.. ప్రస్తుతం తన చేతిలో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటించని ప్యాన్ ఇండియా చిత్రం ‘సలార్’లో శృతి లీడ్ రోల్ చేసింది. ఈ మూవీ డిసెంబర్ 22న విడుదలకు సిద్ధమవుతోంది. అంతే కాకుండా యంగ్ హీరో అడవి శేష్‌తో జతకడుతున్నట్టు అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతలోనే యశ్‌తో కూడా శృతి సినిమా ఉంటుందని తెలిసి తన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మొత్తంగా యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’లో సాయి పల్లవి, శృతి హాసన్ యాడ్ అయితే ఆ ప్రాజెక్ట్‌కు మరింత హైప్ పెరుగుతుంది. ఇప్పటికే ‘కేజీఎఫ్’తో కన్నడతో పాటు తెలుగులో కూడా ఒక మార్క్‌ను క్రియేట్ చేసిన యశ్‌కు జోడీగా సాయి పల్లవి నటించడం ప్లస్ అవుతుంది.
Also Read: అమ్మను దూరం పెట్టాను, మూర్ఖంగా ప్రవర్తించాను - జాన్వీ కపూర్