Sridevi daughter Janhvi Kapoor : నటీనటులుగా తల్లిదండ్రులు ఒక మార్క్‌ను క్రియేట్ చేసిన తర్వాత.. వారి ఫేమ్‌ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత తమ వారసులపై ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు లెజెండరీ నటీనటులుగా గుర్తింపు తెచ్చుకుంటే.. వారి వారసులపై అదే రేంజ్‌లో టాలెంట్ కనబర్చాలని ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుతం అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. శ్రీదేవి మరణించిన తర్వాత హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యింది జాన్వీ. కానీ తన మొదటి సినిమా ‘ధడక్’ షూటింగ్ మాత్రం శ్రీదేవి మరణించక ముందే ప్రారంభమయ్యింది. అయితే ఆ షూటింగ్ సమయంలో కావాలనే తన తల్లికి దూరంగా ఉండేదాన్ని అంటూ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది జాన్వీ.


ముందే చెప్పింది..
2018లో ‘ధడక్’ అనే చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టింది జాన్వీ కపూర్. శ్రీదేవి వారసురాలు కావడంతో తన మొదటి సినిమా విడుదల అవ్వకముందు నుంచే తనపై ఒత్తిడి ప్రారంభమయ్యింది. అయితే శ్రీదేవికి మాత్రం తన కూతురిపై ఎలాంటి ఒత్తిడి ఉండడం ఇష్టం ఉండేది కాదట. అందుకే దీని గురించి ముందే జాన్వీకి చెప్పి అలర్ట్ కూడా చేసిందని తెలుస్తోంది. ఇక జాన్వీ కూడా తను ఫీల్ అయిన ప్రెజర్ గురించి తాజాగా బయటపెట్టింది. తన తల్లి పేరు తనను, తన చెల్లి ఖుషీ కపూర్‌ను ఒకరకమైన ఒత్తిడికి గురిచేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ. ఇదంతా వారికి చాలా భారంగా ఉంటుందని వాపోయింది. 


నా శత్రువుకు కూడా ఉండకూడదు..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్.. తన తల్లి గురించి చాలా గొప్పగా మాట్లాడింది. శ్రీదేవిని వర్సటైల్ యాక్టర్ అని పిలిచింది. ‘‘ప్రేక్షకులు నా మొదటి సినిమా పర్ఫార్మెన్స్.. తన మొదటి సినిమా పర్ఫార్మెన్స్‌తో పోల్చరని, తన చివరి సినిమా పర్ఫార్మెన్స్‌తో పోలుస్తారని అమ్మ చెప్తూ ఉండేది. ఇలాంటి ఒక ఒత్తిడి నా శత్రువుకు కూడా ఉండకూడదని కోరుకుంటాను అని అంటుండేది’’ అంటూ శ్రీదేవి.. తనకు చెప్పిన మాటలను గుర్తుచేసుకుంది జాన్వీ.


అదే బాధ..
‘‘నేను, నా చెల్లి మొదట్లో చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్లం. చాలా ఇబ్బందిపడేవాళ్లం. ఏదో భారాన్ని మోస్తూ తిరిగినట్టుగా ఉండేది. కానీ నన్ను అమ్మతో పోలుస్తున్నారని, ఆమె స్థాయి అది అని నేను అర్థం చేసుకున్నాను. అదే నన్ను మోటివేట్ చేయడం మొదలుపెట్టింది’’ అని జాన్వీ తెలిపింది. ‘‘ఈ ప్రెజర్ గురించి నాకు నా మొదటి సినిమా షూటింగ్ ప్రారంభించనప్పుడే అర్థమయ్యింది. అందుకే షూటింగ్ సమయంలో అమ్మను దూరం పెట్టాను. నేను శ్రీదేవి కూతురిని కాబట్టి నాకు మొదటి సినిమా అవకాశం వచ్చిందని అందరూ అనుకునేవారు. అందుకే అమ్మ దగ్గర నుంచి అసలు ఎలాంటి సాయం తీసుకోకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యాను. అమ్మ నటనకు భిన్నంగా నేను యాక్ట్ చేసి చూపించాలనుకున్నాను. అమ్మను సెట్స్‌కు రావద్దని చెప్పేదాన్ని. నాకొక ట్రంప్ కార్డ్ ఉంది అన్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ నేను ఆ సమయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించానని ఇప్పుడు అనిపిస్తోంది. నేను ఆమె కూతురిని అనే నిజం నుంచి పారిపోలేను. అమ్మ ఇక నాతో లేకపోవడం వల్ల అప్పుడు తనను దూరం పెట్టాననే విషయంలో నన్ను మరింత బాధపెడుతోంది’’ అని ఫీల్ అయ్యింది జాన్వీ.


Also Read: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే‌కు హార్ట్ ఎటాక్ - ‘పుష్ప’లో అల్లు అర్జున్‌కు వాయిస్ ఇచ్చింది ఇతడే!