Adivi Sesh Shruti Hassan's movie title will be announced on December 18th: యువ కథానాయకుడు అడివి శేష్, అగ్ర కథానాయిక శృతి హాసన్ జంటగా ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. ఇటీవల సినిమాను అనౌన్స్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... హీరో హీరోయిన్ల ప్రీ లుక్స్ సైతం విడుదల చేశారు. 


పరదా వెనుక రహస్యం ఏమిటి?
ఆ పరదాలు తీసేది ఎప్పుడు?
అడివి శేష్, శృతి హాసన్ నటిస్తున్న తొలి చిత్రమిది. ఆల్రెడీ హీరో హీరోయిన్ల ప్రీ లుక్స్ విడుదల చేశారు. రెండు పోస్టర్లలోనూ కేవలం నటీనటుల కళ్ళు మాత్రమే కనిపించాయి. ఇంటెన్స్ అండ్ ఫైర్సీ లుక్స్ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేశాయి. మరి, ఆ పరదాలు ఏమిటి? వాటి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అంటే... ఈ నెల 18వ తేదీ వరకు వెయిట్ చేయాలి.


అడివి శేష్, శృతి హాసన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్, సినిమా టైటిల్ ఈ నెల 18న విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది.


Also Read: మెంటల్ టార్చర్, బ్లాక్ మెయిల్ నుంచి పేమెంట్ క్లియరెన్స్ వరకు - 'డెవిల్' లేటెస్ట్ కాంట్రవర్సీ






నాగార్జున మేనకోడలు సుప్రియ నిర్మాణంలో... 
అడివి శేష్, శ్రుతి హాసన్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ సంస్థలపై కింగ్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆమె చాలా రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్, సెవెన్ ఎకర్స్ స్టూడియోస్, ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. సోదరుడు సుమంత్ నటించిన సినిమాలకు ఆమె సమర్పకురాలిగా వ్యవహరించారు. అయితే... పాన్ ఇండియా స్థాయిలో తన పేరు మీద సుప్రియ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాత.


Also Read'సలార్' ఫస్ట్ టికెట్ రాజమౌళి కొన్నారోచ్ - మొత్తం మీద బయటకొచ్చిన ప్రభాస్






ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకుడు. అడివి శేష్ 'క్షణం', 'గూఢచారి' చిత్రాలకు కెమెరా వర్క్ అందించారు. ఇప్పుడీ సినిమాతో సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ అవుతున్నారు. కేన్స్ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'లైలా' షార్ట్ ఫిలింకు షానియల్ డియో డైరెక్ట్ చేశారు.



గత ఏడాది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'మేజర్' తర్వాత అడివి శేష్ మరో సినిమా చేయలేదు. 'గూఢచారి 2'ను స్టార్ట్ చేశారంతే! 'మేజర్' సినిమాతో హిందీలోనూ శేష్ విజయం సాధించారు. ఇప్పుడీ షానియల్ డియో సినిమా ఆయనకు రెండో పాన్ ఇండియా సినిమా. ఇటీవల విడుదలైన న్యాచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' చిత్రంలోని ప్రత్యేక గీతం 'ఒడియమ్మా బీటు'లో శృతి హాసన్ సందడి చేశారు. ఈ నెల 22న విడుదల కానున్న 'సలార్' సినిమాలో ఆమె జర్నలిస్ట్ ఆద్య పాత్ర చేశారు.