Prabhas Salaar Interview: ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో 'బాహుబలి' ప్రభాస్. ఇప్పుడు ఆ పాన్ ఇండియా రెబల్ స్టార్ 'సలార్' సినిమాతో ఈ శుక్రవారం (డిసెంబర్ 22న) థియేటర్లలోకి వస్తున్నాడు. అయితే... ఇప్పటివరకు ప్రభాస్ పబ్లిక్ ముందుకు రాలేదు. కానీ, ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి, సినిమా గురించి మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లో...


ఇప్పటివరకు చూడనటువంటి పాత్రలో నన్ను చూస్తారు!
'సలార్'లో తనను ఇప్పటి వరకు చూడనటువంటి పాత్రలో ప్రేక్షకులు చూస్తారని ప్రభాస్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''సినిమాలో క్యారెక్టర్ల మధ్య చక్కటి ఎమోషన్స్ ఉంటాయి. నేను, ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేయాలని డిసైడ్ అయినప్పుడు... ఏ విధంగా ఉంటే అందరినీ ఆకట్టుకోవచ్చు? అని డిస్కస్ చేసుకున్నాం. నా మనసులో ఉన్న ఆలోచనలను ఆయన ముందు ఉంచా. ఏం చేయాలనే విషయాన్ని ఆయన నాకు వివరించారు. మేం అనుకున్న కథకు బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇద్దరం కలిసి వర్క షాప్స్ చేశాం. సరదాగా సినిమాను పూర్తి చేశాం'' అని చెప్పారు. 


నా 21 ఏళ్ళ సినిమా జర్నీలో బెస్ట్ దర్శకుడు ప్రశాంత్!
హీరోగా ప్రభాస్ కెరీర్ మొదలై 21 ఏళ్ళు అవుతోంది. ఈ 21 ఏళ్లలో తాను పని చేసిన బెస్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అని ఆయన తెలిపారు. ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ ''చిత్రీకరణకు ప్రశాంత్ నీల్ నన్ను ఎప్పుడు పిలుస్తాడు? అతడి నుంచి ఫోన్ ఎప్పుడు వస్తుంది? అని ఎదురు చూశా. సెట్‌కు వెళ్లి అతనితో టైమ్ స్పెండ్ చేయడం కోసం వెయిట్ చేశా. ఇంతకు ముందు ఎప్పుడూ నేను ఇలా ఫీల్ అవ్వలేదు. చిత్రీకరణ ప్రారంభించిన నెల రోజుల్లో మేం మంచి స్నేహితులం అయ్యాం'' అని చెప్పారు. 


ప్రశాంత్ నీల్ హీరోల దర్శకుడు!
Prabhas On Prashanth Neel: ప్రశాంత్ నీల్ హీరోల దర్శకుడు అని ప్రభాస్ చెప్పారు. హీరోల టైమింగ్ చూసుకుని, వాళ్ళ షెడ్యూల్స్‌కు తగ్గట్టు షూటింగ్ ప్లాన్ చేస్తారని ఆయన వివరించారు. ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ ''నాతో పాటు శృతి హాసన్, పృథ్వీరాజ్... చిత్రీకరణలో మేమంతా కలిశామంటే ఆ రోజంతా సరదాగా గడిచిపోయేది. నేను ఎప్పుడూ షాట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం రాలేదు. ప్రశాంత్ నీల్ అంత జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే ఏర్పాట్లు అన్నీ చేసుకుని మమ్మల్ని పిలిచేవాడు. మేం ఎప్పుడూ వెయిట్ చేయలేదు. నేను వెళ్ళగానే అన్నీ ఆపేసి నా సీన్స్ తీసేవాడు'' అని చెప్పారు.


Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!


'సలార్' కోసం ప్రత్యేకంగా కష్టపడలేదు!  
'సలార్' సినిమా కోసం తాను ప్రత్యేకంగా కష్టపడలేదని ప్రభాస్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''క్యారెక్టర్ డిమాండ్ మేరకు కండలు పెంచాలని ప్రశాంత్ నీల్ ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టు నేను మారాను. అది నాకు సర్వ సాధారణం. గత 21 ఏళ్లలో క్యారెక్టర్ల కోసం నేను మారిన దానితో పోల్చుకుంటే ఈ సినిమా కోసం జరిగిన మార్పులు చాలా సాధారణమైన విషయమే'' అని చెప్పారు. 'సలార్ సీజ్ ఫైర్' సినిమాలో రెండు ప్రధాన పాత్రల మధ్య చక్కటి సోదర భావాన్ని ప్రేక్షకులు చూస్తారు.


Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!