దర్శక ధీరుడు రాజమౌళి రంగంలోకి దిగారు. తన బాహుబలి కోసం జక్కన్న కదిలి వచ్చారు. ఓ ఇంటర్వ్యూ కూడా చేశారని 'సలార్' యూనిట్స్ సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
రాజమౌళి చేతికి 'సలార్' ఫస్ట్ టికెట్
Salaar Advance Booking: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సలార్'. ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కొన్ని ఏరియాలలో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు సినిమా రాజధాని హైదరాబాద్, నైజాం ఏరియాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయా? అంటే... ఇంకా లేదు. త్వరలో ఓపెన్ కానున్నాయి. అయితే... ఆల్రెడీ ఫస్ట్ టికెట్ మాత్రం అమ్మేశారు.
'బాహుబలి' తాజా సినిమా టికెట్టును రాజమౌళి కొనుగోలు చేశారు. 'సలార్' చిత్రాన్ని నైజాంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ అధినేత నవీన్ ఎర్నేని ఈ 'సలార్' తొలి టికెట్టును రాజమౌళికి అందజేశారు.
బాహుబలితో జక్కన్న స్పెషల్ ఇంటర్వ్యూ!
Rajamouli interviews Prabhas for Salaar: 'సలార్' కోసం ప్రభాస్‌ను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రయివేట్ స్టూడియోలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ బయటకు రావడం ఇదే మొదటిసారి. త్వరలో దీనిని విడుదల చేయనున్నారు. ఇక... దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలిసి మరొక ఇంటర్వ్యూ ప్లాన్ చేసే అవకాశం ఉందని తెలిసింది.
Also Read: 'సలార్' కోసం వర్క్ షాప్స్ చేశామంతే, ప్రత్యేకంగా కష్టపడలేదు - ప్రభాస్ ఇంటర్వ్యూ
Salaar cast and crew names : 'సలార్'లో ప్రభాస్ జోడీగా స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ నటించారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రలో ఆమె కనిపించనున్నారు. ట్రైలర్ చూస్తే... ఓ షాట్ లో ఆమె కూడా ఉన్నారు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది.
Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
'సలార్' సినిమాలో ఇతర నటీనటుల విషయానికి వస్తే... ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటించారు. 'కెజియఫ్'లో కూడా ఆమె ఉన్నారు. అయితే... అందులో ఆమెది ముస్లిం పాత్ర. ఇందులో హిందూ పాత్ర! ఇక, కథలో కీలకమైన వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వర్తించారు.