తమిళ నటుడు ప్రభు కుమార్తెతో యంగ్ డైరెక్టర్ పెళ్లి - హాజరైన విశాల్!
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ తమిళ నటుడు ప్రభు కుమార్తెతో అదిక్ రవిచంద్రన్ పెళ్లి ఘనంగా జరిగింది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ జరిగిన ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా తమిళ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య అధిక్ రవిచంద్రన్ తో ప్రేమలో ఉన్నట్లు గతంలోని వార్తలొచ్చాయి. డిసెంబర్ 15 శుక్రవారం ఉదయం అదిక్ రవిచంద్రన్, ఐశ్వర్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


యోగిబాబుతో ప్రభాస్ కామెడీ - టాలీవుడ్‌కు కోలీవుడ్ స్టార్ కమెడియన్ ఎంట్రీ
ప్రముఖ తమిళ హాస్య నటుడు యోగి బాబు మన  తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. తెలుగులో డబ్బింగ్ అయిన పలు తమిళ సినిమాల్లో ఆయన నటించారు. తన కామెడీతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా నవ్వించారు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ మారుతి సినిమాలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు యోగి బాబు ఓ తమిళ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆల్రెడీ ఆయన షూటింగ్ కూడా చేశారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


న్యూ ఇయర్‌కి సింగర్ సునీత తనయుడి సినిమా - 2024 ఓపెనింగ్ హీరో ఆకాషే!
ప్రముఖ గాయని, తెలుగు కోకిల సునీత గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకటా... రెండా... ఎన్నో వందల సినిమాల్లో వేల పాటలకు తన స్వరంతో ప్రాణం పోశారు ఆవిడ. ఇప్పుడు ఆమె తనయుడు వెండితెరకు పరిచయం అవుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆ సినిమాను విడుదల చేయనున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


లిప్ లాక్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయిన సుమ కొడుకు - ‘బబుల్‌గమ్‘ ట్రైలర్‌ పెద్దలకు మాత్రమే!
నటుడు రాజీవ్‌ కనకాల, యాంకర్ సుమ కనకాల దంపతుల తనయుడు రోషన్‌ కనకాల హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఆయన తాజాగా ‘బబుల్‌గమ్‌’ అనే సినిమా చేస్తున్నారు. రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. “ప్రేమ బబుల్‌ గమ్‌ లాంటిది. మొదట్ల తీయగుంటది. తర్వాత అంటుకుంటది” అంటూ సాగే డైలాగ్స్‌ తో టీజర్ ప్రేక్షకులలో బాగా వెళ్లిపోయింది. తాజాగా చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మాట రాదండీ - అంజి ఉరఫ్ అల్లరి నరేష్‌ను తీసుకొచ్చిన కింగ్ నాగార్జున
'అల్లరి' నరేష్ ఓ ఇమేజ్ ఛట్రంలో బందీ కానీ నటుడు. ఆయన కామెడీ ఎంత బాగా చేయగలరో... సీరియస్ రోల్స్ కూడా అంతే బాగా చేస్తారు. అందుకు 'శంభో శివ శంభో', 'నాంది', 'ఉగ్రం' సినిమాలే మంచి ఉదాహరణలు. కామెడీ ఫిలిమ్స్ పక్కన పెట్టిన 'అల్లరి' నరేష్... కొన్ని సినిమాలుగా సీరియస్ రోల్స్ చేస్తున్నారు. మళ్ళీ ఆయన వినోదాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు అక్కినేని నాగార్జున. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)