Allari Naresh as Anji In Naa Saami Ranga: 'అల్లరి' నరేష్ ఓ ఇమేజ్ ఛట్రంలో బందీ కానీ నటుడు. ఆయన కామెడీ ఎంత బాగా చేయగలరో... సీరియస్ రోల్స్ కూడా అంతే బాగా చేస్తారు. అందుకు 'శంభో శివ శంభో', 'నాంది', 'ఉగ్రం' సినిమాలే మంచి ఉదాహరణలు. కామెడీ ఫిలిమ్స్ పక్కన పెట్టిన 'అల్లరి' నరేష్... కొన్ని సినిమాలుగా సీరియస్ రోల్స్ చేస్తున్నారు. మళ్ళీ ఆయన వినోదాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు అక్కినేని నాగార్జున. 


కింగ్ నాగార్జున అక్కినేని (Akkineni Nagarjuna) కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా 'నా సామి రంగ'. ప్రముఖ నృత్య దర్శకుడు విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. పవన్ కుమార్ చిత్ర సమర్పకులు. ఈ సినిమాలో 'అల్లరి' నరేష్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇవాళ ఆయన క్యారెక్టర్ ఇంట్లో గ్లింప్స్ విడుదల చేశారు. 


అంజి పాత్రలో 'అల్లరి' నరేష్!
Allari Naresh character in Naa Saami Ranga movie: 'నా సామి రంగ'లో అంజి పాత్రలో 'అల్లరి' నరేష్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. 'మా అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం. లేదంటే మాటొచ్చేత్తది' అంటూ నరేష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ రోజు ఆయన గ్లింప్స్ విడుదల చేశారు.


అంజి క్యారెక్టర్ మాంచి సరదాగా ఉండబోతుందని గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. జాతర, పెళ్లి... సిట్యువేషన్ ఏదైనా సరే, ఆయన డ్యాన్స్ మాత్రం సూపర్! ఇక, 'మాటొచ్చేత్తది'... అనేది అంజి సిగ్నేచర్ డైలాగ్! అల్లరి నరేష్ స్టైల్ ఆఫ్ కామెడీని పూర్తి స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు మళ్ళీ తీసుకు వస్తుందని యూనిట్ అంటోంది.


Also Readపది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!



'నా సామి రంగ'లో నాగార్జున సరసన కన్నడ భామ ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. తెలుగు ఆమెకు రెండో చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్'తో తెలుగు తెరకు ఆమె పరిచయం అయ్యారు. ఈ మధ్య నాగార్జున, ఆషికాపై తెరకెక్కించిన 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది' పాటను విడుదల చేశారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి అందించిన బాణీకి మరో ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించారు. సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాల పాటను ఆలపించారు. ఆ పాటకు దర్శకుడు విజయ్ బిన్నీతో పాటు మ్యాగీ కొరియోగ్రఫీ అందించారు. ఆ పాటకు ప్రేక్షకుల నుంచి స్పందన బావుంది. 


సంక్రాంతికి 'నా సామి రంగ' విడుదల
Naa Saami Ranga release on Sankranti 2024: ప్రస్తుతం హైదరాబాద్‌లో 'నా సామి రంగ' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరో వైపు ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.


Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!


నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో 'పలాస' దర్శకుడు  కరుణ కుమార్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సాహిత్యం: చంద్రబోస్, సంగీతం: ఎంఎం కీరవాణి, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి. నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, దర్శకత్వం: విజయ్ బిన్నీ.