Security Breach Parliament:


లలిత్‌ ఝా నేపథ్యమిదీ..


లోక్‌సభ దాడికి ప్లాన్ చేసిన మాస్టర్‌మైండ్ (Parliament Security Breach) లలిత్ ఝాని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. లలిత్‌ ఝాతో (Who is Lalit Jha) పాటు మరో ఇద్దరు నిందితులనూ అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. అయితే...ఈ మొత్తం ఘటనకు సూత్రధారి లలిత్ ఝా అరెస్ట్‌తో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఈ దాడి జరిగినప్పటి నుంచి లలిత్ ఝా పరారీలో ఉన్నాడు. ఇప్పుడిప్పుడే ఈ నిందితుడి బ్యాగ్రౌండ్‌ గురించి కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. బిహార్‌కి చెందిన ఝా...కోల్‌కత్తాలో టీచర్‌గా పని చేస్తున్నాడు. పార్లమెంట్‌కి సమీపంలోని కర్తవ్యపథ్ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్ అంటే లలిత్‌కి ఎంతో ఇష్టం. ఆయన ఐడియాలజీపై ఆసక్తి పెంచుకున్నాడు. లలిత్ ఝా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడు కాదని, మౌనంగా ఉండేవాడని సన్నిహితులు చెబుతున్నారు. స్థానిక విద్యార్థులకు టీచింగ్ చేసేవాడు. కొన్నేళ్ల క్రితం కోల్‌కత్తాలోని బుర్రాబజార్‌కి ఒక్కడే వచ్చాడు. చాలా రోజుల పాటు అక్కడే ఒంటరిగా ఉన్నాడు. కానీ ఎవరికీ పెద్దగా కనిపించే వాడు కాదు. లో ప్రొఫైల్ మెయింటేన్ చేసేవాడు. రెండేళ్ల క్రితం ఉన్నట్టుండి అక్కడి నుంచి ఖాళీ చేశాడు. అక్కడే ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఓ టీ షాప్ ఓనర్ ఇదంతా చెప్పాడు. 


ప్లాన్ బీ కూడా...


ఈ దాడికి సంబంధించి మరో కీలక విషయమూ వెలుగులోకి వచ్చింది. లోక్‌సభలో టియర్ గ్యాస్ ప్రయోగించాలని ప్లాన్ చేసుకున్న నిందితులు ఒకవేళ ఈ Plan A ఫెయిల్ అయితే Plan B అమలు చేయాలని ముందుగానే స్కెచ్ వేసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయం చెప్పాడు ప్రధాన నిందితుడు లలిత్ ఝా. నీలమ్, అమోల్ ఒకవేళ ఏ కారణం వల్లనైనా పార్లమెంట్‌ వరకూ వెళ్లలేకపోతే...మహేశ్, కైలాశ్‌ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. వేరే రూట్‌ నుంచి లోపలికి వెళ్లి పార్లమెంట్ ఆవరణలో కలర్ బాంబ్‌లు కాల్చాలని అనుకున్నారు. మీడియా కెమెరాల ముందు నినాదాలు చేయాలని భావించారు. కానీ...వాళ్లు అనుకున్నట్టుగ్గా Plan A వర్కౌట్ అయింది. యథావిధిగా సాగర్ శర్మ, మనోరంజన్ సభలోకి దూసుకెళ్లి కలర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటన తరవాత తాను ఎక్కడ ఉండాలో కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు లలిత్ ఝా. మహేశ్ ఇంట్లో తలదాచుకున్నాడు. తన ఐడీ కార్డ్‌ ఉపయోగించి ఓ గెస్ట్‌హౌజ్‌లో షెల్టర్ ఇచ్చాడు. 


పార్లమెంట్‌ బయట నీలమ్, ఆమోల్ షిండేలు పొగ స్ప్రే చేశారు. లలిత్ ఝా వీడియో రికార్డు చేశాడు. అక్కడి నుంచి రాజస్థాన్‌ పారిపోవడానికి ముందే...సోషల్ మీడియాలో వీడియో పోస్ట్‌ చేశాడు. మీడియాలో కవరయ్యేలా చూడాలని ఓ ఎన్జీవోకు వీడియో క్లిప్‌ పంపాడు. దాడికి ముందే నలుగురి ఫోన్లను లలిత్ తీసుకున్నాడు. నిరుద్యోగం, మణిపూర్‌లో హింసకు వ్యతిరేకంగానే దాడి చేసినట్లు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది.


Also Read: Lok Sabha Security Breach: ఆధారాలు మాయం చేసిన లోక్‌సభ దాడి మాస్టర్‌మైండ్‌, మొబైల్స్‌ని కాల్చేశాడట!