Yogi Babu in Prabhas next movie: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ నెల 22న థియేటర్లలోకి రానున్న 'సలార్' సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే... ఆ సినిమా కాకుండా మరో రెండు సినిమాలు లైనులో ఉన్నాయి. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ'. ఆ సినిమాలో ప్రభాస్ లుక్, వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. మారుతి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నారు. 


ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ నిర్మిస్తున్న సంగతి పరిశ్రమ ప్రముఖులకు, ప్రేక్షకులు తెలుసు. అయితే... నిర్మాణ సంస్థ మాత్రం ఆ సినిమా అప్డేట్స్ ఇవ్వడం లేదు. తమ కంటే ముందు ఉన్న సినిమాలు విడుదల అయ్యాక అప్డేట్స్ ఇస్తామని చెబుతూ వస్తోంది. ప్రభాస్, మారుతి సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న రెబల్ స్టార్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్!


ప్రభాస్ సినిమాలో యోగి బాబు!
Yogi Babu Telugu debut movie: ప్రముఖ తమిళ హాస్య నటుడు యోగి బాబు మన  తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. తెలుగులో డబ్బింగ్ అయిన పలు తమిళ సినిమాల్లో ఆయన నటించారు. తన కామెడీతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా నవ్వించారు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. 
ప్రభాస్ మారుతి సినిమాలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు యోగి బాబు ఓ తమిళ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆల్రెడీ ఆయన షూటింగ్ కూడా చేశారట. మరి, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ప్రభాస్ - యోగి బాబు కామెడీ సీన్స్ ఎలా ఉంటాయి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.


Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!


ముగ్గురు హీరోయిన్లు ఎవరంటే?
ప్రభాస్, మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరు నిధి అగర్వాల్. ఆల్రెడీ ఆమె 'ఇస్మార్ట్ శంకర్'తో పాటు కొన్ని సినిమాలు చేశారు. మరొక హీరోయిన్ మాళవికా మోహనన్. తమిళ డబ్బింగ్ సినిమాలతో ఆమె కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే... తెలుగులో ఆమెకు తొలి సినిమా ఇది. 'రాధే శ్యామ్' సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన రాజ్ తరుణ్ 'లవర్స్' ఫేమ్ రిద్ధి కుమార్ మరొక హీరోయిన్. హారర్ కామెడీ చిత్రమిది. దీనికి 'రాజు డీలక్స్' టైటిల్ ప్రచారంలో ఉంది. దాదాపుగా ఆ టైటిల్ ఖరారు కావచ్చని సమాచారం.


Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!



'ప్రేమ కథా చిత్రమ్', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండగే' సినిమాలు చూస్తే చాలు... మారుతి కామెడీ టైమింగ్ గురించి అవుతుంది. ప్రభాస్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. 'బుజ్జిగాడు మేడిన్ చెన్నై' సినిమాలో మంచి కామెడీ చేశారు. అందువల్ల, మారుతి దర్శకత్వంలో ప్రభాస్ అనగానే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా రోజుల తర్వాత రెబల్ స్టార్ కామెడీ టైమింగ్ చూడవచ్చని ఆశిస్తున్నారు.