భగ భగ భగ భోళా... ఎదురొచ్చేటోడు లేడు - మెగా ర్యాప్ యాంథమ్ వచ్చేసింది
మెహర్ రమేష్‌లో మంచి కథకుడు, దర్శకుడు మాత్రమే కాదు... గీత రచయిత కూడా ఉన్నారు. ఇంతకు ముందు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఆయన రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రేక్షకులతో పాటు అభిమానుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. మెగాస్టార్ పాట కోసం మెహర్ రమేష్ మరోసారి పెన్ను పట్టుకున్నారు. (పూర్తి వివరాల కెసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘పుష్ప 2’ షూటింగ్ 50 శాతమే పూర్తయ్యిందా? ఎందుకు ఇంత లేట్ అవుతోంది?
టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవల్లో దుమ్మురేపిన చిత్రం 'పుష్ప’. ఎలాంటి అంచనాలు లేకుండా హిందీలో రిలీజైన ఈ సినిమా, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టించింది. సుకుమార్ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలోని డైలాగులు, పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తొలి భాగం దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి 'పార్ట్ 2' పైనే పడింది. ఈ సినిమాపైనా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగాయి. (పూర్తి వివరాల కెసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఆ హీరో ఇచ్చాడా? - సమంత రెస్పాన్స్ చూశారా?
అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు మయోసైటిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్య పరిస్థితిని దాచి మరీ 'యశోద' చిత్రీకరణ పూర్తి చేశారామె! ఆ సినిమా ప్రచార కార్యక్రమాల సమయంలో సమంతకు మయోసైటిస్ అనేది తెలిసింది. 'యశోద' తర్వాత 'శాకుంతలం' చేశారు. ఇటీవల 'ఖుషి' సినిమా, 'సిటాడెల్' వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఒకవైపు మయోసైటిస్‌కు  చికిత్స తీసుకుంటూ మరోవైపు షూటింగులు చేస్తున్నారు. (పూర్తి వివరాల కెసం ఇక్కడ క్లిక్ చేయండి.)


చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘చంద్రముఖి-2’. ఈ చిత్రాన్ని దర్శకుడు పి. వాసు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ ఈ చిత్రంలో ‘చంద్రముఖి’ పాత్ర పోషించబోతోంది. రజనీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు ఈ మూవీ సీక్వెల్ గా రూపొందుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన  ప్రచార చిత్రాలు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే,  రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ సైతం విడుదల అయ్యింది. రాజు వేషధారణలో ఆయన నడిచి వస్తున్న పోజు అందరినీ అలరించింది.  లారెన్స్ కళ్లల్లో రాజసం ఉట్టిపడుతూ కనిపించింది.  ‘చంద్రముఖి’ సినిమాలో రజనీకాంత్ రాజుగా నటించగా, ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ రాజుగా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాత్రపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. (పూర్తి వివరాల కెసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మంగళగిరిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కీలక షెడ్యూల్, షూటింగ్ ఎప్పటి నుంచి అంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలు ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఆయన నటించిన ‘బ్రో’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అందుకుంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతోంది. అటు హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’,  క్రిష్ జాగర్లమూడితో ‘హరిహర వీరమల్లు’ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి టీజర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. (పూర్తి వివరాల కెసం ఇక్కడ క్లిక్ చేయండి.)