మెహర్ రమేష్ (Meher Ramesh)లో మంచి కథకుడు, దర్శకుడు మాత్రమే కాదు... గీత రచయిత కూడా ఉన్నారు. ఇంతకు ముందు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఆయన రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రేక్షకులతో పాటు అభిమానుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. మెగాస్టార్ పాట కోసం మెహర్ రమేష్ మరోసారి పెన్ను పట్టుకున్నారు. 


మెగా ర్యాప్ యాంథమ్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). ఇదొక మాస్ అండ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్.  రామబ్రహ్మం సుంకర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది.


ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.  ఆల్రెడీ మూడు పాటల్ని విడుదల చేశారు. ఈ రోజు 'ది రేజ్ ఆఫ్ భోళా' పేరుతో మెగా ర్యాప్ యాంథమ్ విడుదల చేశారు. 


'ది రేజ్ ఆఫ్ భోళా'కు ఫిరోజ్ ఇజ్రాయెల్ (నవాబ్ గ్యాంగ్)తో కలిసి మెహర్ రమేష్ సాహిత్యం అందించారు. ఈ పాటను 'నవాబ్ గ్యాంగ్' ఫేమ్స్ అసుర, ఫిరోజ్ ఇజ్రాయెల్ ఆలపించారు.


''ఒకటి, రెండు, మూడు...
వచ్చాడు అన్న చూడు!
స్టేట్ అంతా వెతికి చూడు...
ఎదురు వచ్చేటోడు లేడు!
భగ భగ భగ భోళా......'' 
అంటూ సాగిందీ ర్యాప్ యాంథమ్.


Also Read ట్రెండింగులో ఉంది 'బ్రో' - రెండో వారంలోనూ బాక్సాఫీస్‌లో పవన్ జోరు



'భోళా శంకర్' సినిమాలో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా  (Tamannaah Bhatia) నటించారు. చిరు, తమన్నా మీద తెరకెక్కించిన 'మిల్కీ బ్యూటీ...' పాటకు స్పందన బావుంది. ఇక, చిరు సోదరిగా మహానటి కీర్తీ సురేష్ కనిపించనున్నారు. కీర్తీ సురేష్ ప్రియుడిగా ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కనిపించనున్నారు.


Also Read మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఆ హీరో ఇచ్చాడా? - సమంత రెస్పాన్స్ చూశారా?



'భోళా శంకర్' ట్రైలర్ చూస్తే... కలకత్తాలో చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతారు. ఆ అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఎవరు ఉన్నారు? తమ సమస్యల పరిష్కారానికి పోలీసులు దగ్గర ప్రజలు వెళ్లడం ఆనవాయితీ. ఆ పోలీసులు తమకు సమస్య వస్తే... భోళా భాయ్ దగ్గరకు వెళతారు. ఆ భోళా శంకర్ ఏం చేశాడు? ఏమైంది? అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో చిరంజీవిది క్యాబ్ డ్రైవర్ రోల్ అని క్లారిటీ ఇచ్చారు. ఇందులో తెలంగాణ యాస మాట్లాడుతూ చిరు సందడి చేయనున్నారు. 'ఎట్లా ఇచ్చినా?' అని చిరు అడిగితే... 'అన్నా! మస్త్ ఇచ్చినావ్ అన్నా' అని 'గెటప్' శ్రీను అంటుంటే, అభిమానులకు 'శంకర్ దాదా ఎంబిబిఎస్' గుర్తుకు వచ్చింది. 


'భోళా శంకర్'లో మెగా అభిమానులు ఎదురు చూసే సీన్స్ కొన్నున్నాయి. 'ఖుషి' సినిమాలో 'ఏ మే రాజహా... ఏ మేరీ దునియా' పాటకు చిరు స్టెప్స్ వేశారు. పవర్ స్టార్ భుజం మీద చేయి వేసుకుని చేసే మేనరిజం ఇమిటేట్ చేశారు. ఆ తర్వాత రష్మీతో 'తమ్ముడి పాట మస్త్ ఉందిలే' అనడం హైలైట్. శ్రీముఖితో కలిసి 'ఖుషి'లో నడుము సీన్ స్పూఫ్ కూడా చేశారట. అది ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూడాలి.  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial