పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన సినిమా 'బ్రో'. వంద కోట్ల వసూళ్ళను ఫస్ట్ వీకెండ్ (Bro Collections)లో క్రాస్ చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత జోరు కాస్త తగ్గుతుంది. సోమవారం నుంచి స్కూళ్ళు, ఆఫీసులు తెరుస్తారు కాబట్టి థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య వీకెండ్ ఉన్నట్టు ఉండదు. హిట్టు సినిమాలకు సెకండ్ వీకెండ్ కూడా కళ ఉంటుంది. 'బ్రో' విషయంలో అది జరుగుతోంది.


గంటలో నాలుగు వేలు టికెట్స్ 
'బ్రో'మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడానికి చాలా మంది 'బుక్ మై షో'ను ఆశ్రయిస్తారు. 'బ్రో' సినిమా అందులో ట్రెండింగులో ఉంది. లాస్ట్ వన్ అవర్ సేల్స్ చూస్తే... సుమారు నాలుగు వేల మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. మిగతా టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా 'బ్రో' సేల్స్ బావున్నాయని ట్రెండ్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. ప్రజెంట్ బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా జోరు చూపిస్తోంది. 


కుటుంబ ప్రేక్షకులకు నచ్చింది 'బ్రో'
'బ్రో' సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చింది. అయితే... సినిమా విడుదల తర్వాత రాజకీయ దుమారం చెలరేగింది. ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ 'బ్రో' ఫ్లాప్ అని చెప్పుకొచ్చారు. అప్పుడే ఆయన వ్యాఖ్యలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఖండించారు. తమ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పారు. 


పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులకు 'బ్రో' నచ్చిందని, ఈ  రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు కుటుంబ ప్రేక్షకులు ఎక్కువ మంది వస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పతాక సన్నివేశాలు, అంతకు ముందు వచ్చే ఫ్యామిలీ బాండింగ్ & ఎమోషనల్ సీన్లు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే అందుకు కారణం. 


Also Read : మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఆ హీరో ఇచ్చాడా? - సమంత రెస్పాన్స్ చూశారా?


'తమ్ముడు', 'జల్సా' సినిమాల్లో పాటలు థియేటర్లలో వినిపించినప్పుడు, ఆ రిఫరెన్సులు చూపించినప్పుడు అభిమానుల అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ 'బ్రో' సినిమాలో ఎక్కువ మందిని ఆకట్టుకున్న అంశం. తమన్ నేపథ్య సంగీతానికి కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా 'బ్రో' థీమ్ సాంగ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. 


Also Read 'తంత్ర' శాస్త్రం గుట్టు విప్పే హారర్ థ్రిలర్ - హీరోగా శ్రీహరి సోదరుని కుమారుడు



'బ్రో' సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఆయన తీసిన తమిళ హిట్ 'వినోదయ సీతం' ఆధారంగా రూపొందిన చిత్రమిది. అయితే... తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ తెరకెక్కించాయి. ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. జూలై 28న థియేటర్లలో విడుదలైంది.  


సాయి తేజ్ జోడీగా కేతికా శర్మ, చెల్లెళ్లుగా ప్రియా ప్రకాష్ వారియర్, యువ లక్ష్మి నటించారు. 'మై డియర్ మార్కండేయ' పాటలో ఊర్వశి రౌతేలా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ తల్లి పాత్రలో రోహిణి కనిపించారు. 'వెన్నెల' కిశోర్, అలీ రెజా, రాజా తదితరులు ఇతర పాత్రలు పోషించారు.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial