పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన పాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’ ప్రేక్షకులకు ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో, విజయ్ బాగా డిసప్పాయింట్ అయ్యాడు. కొద్ది రోజుల పాటు సైలెంట్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఏడాది వ్యవధిలో మూడు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.


విడుదలకు రెడీ అవుతున్న 'ఖుషి'


డైరెక్టర్ శివ నిర్వాణ  తాజాగా  'ఖుషి' అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు.  ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ సహా పాటలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ కంపోజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.






పరశురామ్ తో సినిమా చేస్తున్న విజయ్


'ఖుషి' మూవీతో పాటు మరో రెండు సినిమాల్లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. దర్శకుడు పరుశురామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు.  దిల్  రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండతో ఇప్పటికే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశారు పరశురామ్. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి   విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా  నటిస్తోంది.    






గౌతమ్ తిన్ననూరితో స్పై థ్రిల్లర్


అటు గౌతమ్ తిన్ననూరితో కలిసి మరో సినిమా చేస్తున్నాడు  రౌడీ స్టార్.  స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు  దర్శకుడు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో  విజయ్ దేవరకొండ సరసన హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్‌గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు గిరీష్ గంగాధరన్ నిర్వర్తిస్తున్నారు. సితార సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయ్ దేవరకొండ ప్రేక్షకులను అలరించబోతున్నారు.  






Read Also: చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial