పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలు ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఆయన నటించిన ‘బ్రో’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అందుకుంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతోంది. అటు హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’,  క్రిష్ జాగర్లమూడితో ‘హరిహర వీరమల్లు’ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి టీజర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కు పవన్ గ్రీన్ సిగ్నల్


ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవర్ స్టార్ సినిమాల నుంచి రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ నిలిచిపోయింది. ఎన్నికల తర్వాతే ఈ సినిమాలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ, తాజాగా అందుతున్న సమచారం పవన్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఎన్నికలకు ముందే ‘ఉస్తాద్ భగత్ సింగ్’  సినిమా కంప్లీట్ చేస్తానని పవన్ హరీష్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ‘హరిహర వీరమల్లు’ సినిమాను కూడా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట.


‘ఉస్తాద్ భగత్ సింగ్’కు నెల రోజులు కేటాయించిన పవన్!


రీసెంట్ గా పవన్ ను కలిసి దర్శకుడు హరీష్ శంకర్, సినిమా షూటింగ్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న పవన్, మూడో విడత యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కోసం కేవలం 30 రోజుల పాటు డేట్స్ ఇస్తానని దర్శకుడితో పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన సమయంలోనే సినిమా కంప్లీట్ చేసేందుకు హరీష్ శంకర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఎలాగైనా ఈ ఏడాది సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి, 2024 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఎన్నికలకు ముందు పవన్ సినిమా విడుదలైతే, పార్టీకి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారట.  


మంగళగిరిలో కీలక షెడ్యూల్   


ఇప్పటికే హైదరాబాద్ సమీపంలోని కోకాపేట్‌లో వేసిన భారీ సెట్స్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఇక తర్వాతి షెడ్యూల్ మంగళగిరిలో కొనసాగనుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయాంకా బోస్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.  చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.  


Read Also: ‘ఆదిపురుష్’ ఎదురుదెబ్బతో ప్రభాస్ కీలక నిర్ణయం, ఆ డీల్స్ నుంచి వెనక్కి తగ్గినట్లేనా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial