చిరంజీవి అభిమాని సినిమా - ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్
'ద శివశంకర వరప్రసాద్ షో బిగిన్స్' - ఇదీ 'బెదురులంక 2012' సినిమా ట్రైలర్‌లో లాస్ట్ డైలాగ్. ఇది చెప్పింది ఎవరో తెలుసా? హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda). మెగాస్టార్ చిరంజీవికి ఆయన వీరాభిమాని అనేది ప్రేక్షకులు అందరికీ తెలిసిన విషయమే. 'బెదురులంక 2012'లో ఆయన క్యారెక్టర్ పేరు కూడా శివ. రెండూ కలిసి రావడంతో చిరు అభిమానం చూపించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మా ప్రేమకు అయిదేళ్లు, రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
రౌడీ హీరో విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కమర్షియల్ గా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో రూ. 5 కోట్లతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అదుర్స్ అనిపించింది. రష్మికతో పాటు విజయ్ కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది. ఈ చిత్రం తర్వాత విజయ్, రష్మిక స్టార్ హీరో, హీరోయిన్లుగా మారిపోయారు. 2018లో ఆగస్టు 15న విడుదలైన ‘గీత గోవిందం’ మూవీ రీసెంట్ గా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయ్, పరుశు రామ్, రష్మిక మందన్న కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా తెరకెక్కిస్తున్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
సైఫ్ అలీ ఖాన్ బర్త్‌డే స్పెషల్ - ‘దేవర’లో ‘భైర’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఎన్టీఆర్!
‘దేవర’ టీమ్ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. బుధవారం (ఆగస్టు 16వ తేదీ) సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నోరా - వరుణ్ తేజ్ 'మట్కా' లుక్ టెస్ట్ కోసం వచ్చిందిరా!
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ రూటే సపరేటు! కంటెంట్ బేస్డ్ కథల కోసం ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటారు. తనను తాను ఓ ఇమేజ్ చట్రంలో బందీ కాకుండా చూసుకునే కథానాయకుడు ఆయన. ఇప్పుడు ఆయన మరో కొత్త కథతో సినిమా చేయబోతున్నారు. 'పలాస', 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాల దర్శకుడు కరుణ కుమార్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం నోరా ఫతేహి హైదరాబాద్ వచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
టైమ్ ను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలని అనిపిస్తోంది - ‘ఖుషి’ ఈవెంట్‌లో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం 'ఖుషి'. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో మ్యూజికల్ కాన్సెర్ట్ నిర్వహించారు మేకర్స్. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ దేవరకొండ, సమంతతో పాటు చిత్ర బృందం పాల్గొన్నది. ఈ సందర్భంగా మాట్లాడిన సమంత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)