'ద శివశంకర వరప్రసాద్ షో బిగిన్స్' - ఇదీ 'బెదురులంక 2012' సినిమా ట్రైలర్‌లో లాస్ట్ డైలాగ్. ఇది చెప్పింది ఎవరో తెలుసా? హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda). మెగాస్టార్ చిరంజీవికి ఆయన వీరాభిమాని అనేది ప్రేక్షకులు అందరికీ తెలిసిన విషయమే. 'బెదురులంక 2012'లో ఆయన క్యారెక్టర్ పేరు కూడా శివ. రెండూ కలిసి రావడంతో చిరు అభిమానం చూపించారు.


రామ్ చరణ్ విడుదల చేసిన ట్రైలర్
కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించిన సినిమా 'బెదురులంక 2012'. ఆగస్టు 25న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ చిత్రాన్ని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.


చిరంజీవి అభిమాని కార్తికేయ నటించిన ఈ 'బెదురులంక 2012' సినిమా ట్రైలర్ (Bedurulanka 2012 Trailer)ను చిరు తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయడం విశేషం. ట్రైలర్ చూసిన చరణ్ ''కార్తికేయ, నేహా శెట్టి జోడీ చాలా బావుంది. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. నాకు ట్రైలర్ బాగా నచ్చింది. ముఖ్యంగా అజయ్ ఘోష్ ఎంటరైన తర్వాత మరింత బావుంది. కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా తీశారని అర్థం అవుతోంది. 'ఆర్ఎక్స్ 100' సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా ఆ రేంజ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. మణిశర్మ గారి నేపథ్య సంగీతం బావుంది'' అని చెప్పారు.  


'బెదురులంక' కథేంటి?
Bedurulanka 2012 Story : డిసెంబర్ 21, 2012న ప్రపంచమంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు! ఆ రోజు యుగాంతం రాలేదు. ఎటువంటి ప్రళయం లేదు. అయితే, ఏపీలోని లంక గ్రామాల్లో ఒకటైన బెదురులంకలో కేటుగాళ్ళు ప్రజల్లో భక్తి, అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవాలని యుగాంతం అంటూ భయపెట్టి దేవుడి పేరుతో దోపిడీకి తెర తీశారు. ఆ కేటుగాళ్ళ మాటలు నమ్మని శివ అలియాస్ శంకర వరప్రసాద్ (కార్తికేయ గుమ్మకొండ) ఏం చేశాడు? వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాడు? అనేది సినిమా కథగా తెలుస్తోంది. 


కామెడీ, రొమాన్స్, యాక్షన్, డ్రామా... 'బెదురులంక 2012'లో ప్రేక్షకులు కోరుకునే అంశాలు అన్నీ ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. హీరోని పిచ్చిగా ప్రేమించే అమ్మాయి పాత్రలో నేహా శెట్టి కనిపించారు. హీరోని 'ఐ లవ్యూ' చెప్పమని ఆమె అడగటం క్యూట్ గా ఉంది. 


Also Read : మెగాస్టార్ చిరు మోకాలికి స్వల్ప శస్త్రచికిత్స - ఢిల్లీ ఆసుపత్రిలో అడ్మిట్



'సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తినప్పప్పటికీ, ముందు మూడు యుగాలను అంతం కాకుండా ఆపలేకపోయినప్పుడు ఈ బ్రహ్మం గాడు (శ్రీకాంత్ అయ్యంగార్), డేనియల్ గాడు (ఆటో రామ్ ప్రసాద్) కలిసి కలియుగాంతాన్ని ఆపేస్తానంటే మీరు ఎలా నమ్మేశారండి?' అని హీరో వేసే ప్రశ్న ప్రేక్షకుల్లో ఆలోచన కలిగించేలా ఉంది. ప్రేక్షకుల నుంచి ట్రైలర్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుందని దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన 'వెన్నెల్లో ఆడపిల్ల...' పాటకు మంచి స్పందన లభించింది. ఇటీవల విడుదలైన 'సొల్లుడా శివ...' సాంగ్ సైతం శ్రోతలను ఆకట్టుకుంటోంది.


Also Read : చిరంజీవికి డబ్బే ముఖ్యమైతే 'ఆచార్య'కు తిరిగి ఇస్తారా? 'ఏజెంట్'కు అనిల్ సుంకర ఇచ్చారా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial