మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) రూటే సపరేటు! కంటెంట్ బేస్డ్ కథల కోసం ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటారు. తనను తాను ఓ ఇమేజ్ చట్రంలో బందీ కాకుండా చూసుకునే కథానాయకుడు ఆయన. ఇప్పుడు ఆయన మరో కొత్త కథతో సినిమా చేయబోతున్నారు. 'పలాస', 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాల దర్శకుడు కరుణ కుమార్ (Karuna Kumar)తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం నోరా ఫతేహి హైదరాబాద్ వచ్చారు. 


'మట్కా'లో నోరా... హైదరాబాద్ ఆగయా!
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమా 'మట్కా' (Matka Movie). ఆయన 14వ చిత్రమిది. కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా ఫతేహి (Nora Fatehi) కీలక పాత్ర చేస్తున్నారు. 


తెలుగు ప్రేక్షకులకు నోరా ఫతేహి కొత్త ఏమీ కాదు. 'టెంపర్'లో 'ఇట్టాగే రెచ్చిపోదాం' సాంగ్ చేశారు. 'బాహుబలి'లోని 'మనోహరి...' పాటలో డ్యాన్స్ చేసిన ముగ్గురు అమ్మాయిల్లో ఆమె ఒకరు. 'కిక్ 2', 'షేర్', 'లోఫర్', 'ఊపిరి' సినిమాల్లో కూడా నోరా ఫతేహి పాటలు చేశారు. ఇప్పుడు ఆమె హైదరాబాద్ వచ్చారు. అదీ 'మట్కా' సినిమా కోసం! తాజాగా 'మట్కా' కోసం హైదరాబాద్‌లో నోరా ఫతేహి లుక్ టెస్ట్ చేశారు. ఈ చిత్రంలో ఆమె ఓ పాటతో పాటు కీలక పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం తెలియజేసింది.


Also Read : చిరంజీవి అభిమాని సినిమా - ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్ 






విశాఖ నేపథ్యం... జూదం ప్రధానాంశం!
Varun Tej Karuna Kumar Movie Backdrop : విశాఖ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్ సినిమా ఉంటుందని నిర్మాతలు సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసినప్పుడు చెప్పారు. ''మట్కా' అనేది ఒక రకమైన జూదం. విశాఖ నేపథ్యంలో 1958 - 1982 కాలం మధ్య కథ జరుగుతుంది. యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ సంఘటన ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ నాలుగు గెటప్‌లలో చూడబోతున్నాం. వరుణ్ తేజ్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అవుతున్నారు'' అని నిర్మాతలు చెప్పారు.


Also Read చిరంజీవికి డబ్బే ముఖ్యమైతే 'ఆచార్య'కు తిరిగి ఇస్తారా? 'ఏజెంట్'కు అనిల్ సుంకర ఇచ్చారా?



ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున'. అది ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంకో సినిమా... ఏవియేషన్ థ్రిల్లర్. దానిని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆ సినిమాకు 'ఆపరేషన్ వేలంటైన్' టైటిల్ ఖరారు చేసినట్లు ఇటీవల వెల్లడించారు. 


వరుణ్ తేజ్ కథానాయకుడిగా నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించనున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, 'మైమ్' గోపి, రూప లక్ష్మి, విజయ రామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : కార్తీక శ్రీనివాస్ ఆర్, కళా దర్శకత్వం : సురేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : ఆర్కే జానా, ఛాయాగ్రహణం : ప్రియా సేత్, సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థ : వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాతలు : మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial