టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఒక్కొక్కరుగా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఇప్పటివరకు డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ, రానా, నవదీప్ లు ఈడీ ముందు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. రేపు సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్ ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. అలాగే సెప్టెంబర్ 17న తనీష్, సెప్టెంబర్ 22న తరుణ్ విచారణకు హాజరుకానున్నారు. ఈ విచారణ అనంతరం ఈడీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. 


Also Read : నవదీప్‌ను విచారిస్తున్న ఈడీ.. ఎఫ్-క్లబ్‌ కేంద్రంగా డ్రగ్స్ లావాదేవీలు?


ముమైత్ బ్యాంక్ అకౌంట్ వివరాలు, కెల్విన్ తో పరిచయాలు, మనీలాండరింగ్ తదితర అంశాలపై ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నవదీప్ ను ఈడీ అధికారులు మరోసారి విచారణకు రమ్మని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్ల క్రితం ఈ కేసు మొదలైనప్పటి నుంచి చాలా మంది నవదీప్ వైపు అనుమానంగా చూశారు. అలాంటి వ్యక్తిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా 9 గంటల పాటు ప్రశ్నించారు. 


అక్కడితో నవదీప్ ఎపిసోడ్ పూర్తవ్వలేదు. విచారణకు మరోసారి హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు నవదీప్ ను ఆదేశించారు. ఇప్పటివరకు విచారణకు హాజరైన ఏ సెలబ్రిటీని కూడా ఈడీ ఇలా అడగలేదు. నవదీప్ విషయంలో మాత్రం మరోసారి రావాల్సి ఉంటుందని చెప్పారు. నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ ను ఒకేసారి ప్రశ్నించారు ఈడీ అధికారులు. డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించిన వివరాలు అడిగారు. అయితే మేనేజర్ తో పాటు నవదీప్ పొంతనలేని సమాధానాలు ఇచ్చారట. కొన్ని ప్రశ్నలను నవదీప్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారట. దీంతో మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు నవదీప్ కు స్పష్టం చేశారు.  


Also Read: మత్తులో మాణిక్యాలు.. ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కథ, ఆ పార్టీయే కొంప ముంచిందా?


Also Read: ‘శ్రీకాంత్ జాగ్రత్త.. నా కళ్ల ముందు హీరో అయ్యావు’.. నరేష్ మండిపాటు


Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సైఫ్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కాదు, బిగ్ స్క్రీన్‌పైనే ‘ఆదిపురుష్’ అంటూ హింటిచ్చిన రావణుడు!


Also Read: ‘లవ్ స్టోరీ’లో ఆ డైలాగ్‌తో.. తెలంగాణ ప్రభుత్వానికి సెటైర్?


Also read: అపోలో ఆసుపత్రికి కృష్ణంరాజు.. కంగారు పడొద్దన్న రెబల్ స్టార్ టీమ్


Also read: సమంతకు థాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా..!