కరోనాకి ముందు ఆ తర్వాత అన్నంతగా ఇండస్ట్రీలో పరిస్థితి మారిపోయింది. గతంలో థియేటర్లలో సందడి చేశాక ఓటీటీవైపు చూసే సినిమాలు ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ప్రతివారం థియేటర్లతో పోటీ పడుతూ ఓటీటీలో వచ్చేస్తున్నాయ్. ఇలాంటి సమయంలో అనవసర డిస్కషన్స్‌కి ఛాన్స్ ఇవ్వకుండా ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు సైఫ్ అలీఖాన్.



ప్రస్తుతం తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీస్ లో ప్రభాస్ సినిమాలే ఎక్కువ ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస గాథ ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే 45 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా గురించి సైఫ్ అలీఖాన్ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఓటిటి రిలీజ్ ఉండదని ఓంరౌత్ ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా సిల్వర్ స్క్రీన్‌పై చూసే విధంగా తెరకెక్కిస్తున్నాడని తెలిపాడు. జస్ట్ చిన్న చిన్న స్క్రీన్లలో చూసే సినిమా అయితే ఇది కాదు. ఈ సినిమాలో చాలా సాలిడ్ విజువల్స్ ఉన్నాయి. వాటిని బిగ్ టికెట్‌పై చూసి ఎంజాయ్ చెయ్యాలని పేర్కొన్నాడు సైఫ్.


ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి రోజురోజుకు ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. అయితే డార్లింగ్‌ ప్రభాస్‌ ఇప్పుడు మునుపటి లుక్‌ను కోల్పోతున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఫిట్‌గా ఉండే ప్రభాస్‌ అంకుల్‌లా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో హడావుడి నడిచింది. దీంతో రాముడి క్యారెక్టర్ కోసం ఫిట్‌గా, కండలు తిరిగిన దేహంతో కనిపించాలంటే కష్టపడక తప్పదని ఫిక్సయ్యాడట. అందుకే సరైన లుక్ కోసం యూకేలో ఓ డాక్టర్‌ సమక్షంలో ప్రభాస్‌ ట్రైనింగ్‌ తీసుకోబోతున్నారట. వరల్డ్ క్లాస్ డాక్టర్,  డైటీషన్ వద్ద ప్రభాస్‌ అత్యుత్తమ చికిత్స తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.


Also Read: సమంతకు థాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా..!


గతంలో `బాహుబలి` సినిమాలో రెండు రకాల పాత్రల్లో వేరియేష‌న్స్‌ను చూపించేందుకు ప్ర‌భాస్ బ‌రువు పెరగడం తగ్గడం చేశాడు. `సాహో` కోసం మళ్ళీ స్లిమ్ గా మారాల్సి వచ్చింది. ప్రస్తుతం కూడా ప్రభాస్‌ `రాధేశ్యామ్‌`, `సలార్‌`, `ఆదిపురుష్‌`ల కోసం లుక్‌ మారుస్తున్నాడు.  షేప్‌ ఔట్‌ కావడానికి ఇదికూడా ఓ కారణం. అందుకే  కంటిన్యూగా `ఆదిపురుష్‌` కోసం ప్రత్యేకంగా ఈ డైట్‌ తీసుకోబోతున్నాడని టాక్. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరోవైపు సలార్, ఆదిపురుష్ తో పాటు నాగ్ అశ్విన్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీకి కూడా కమిటయ్యాడు. ఏదేమైనా ఇప్పుడు ‘ఆదిపురుష్’ థియేటర్లలోనే విడుదల కానున్నదని క్లారిటీ వచ్చేసింది.


Also Read: దృశ్యం2 ఓటీటీకే వస్తుందా? విడుదల ఎప్పుడు?


Also Read: ఉమాదేవి బూతులు.. ఫేక్ జనాలపై ఫైర్ అయిన శ్వేతా.. ఈ వారం నామినేషన్‌లో ఉన్నది వారే..