Drushyam2 Release Date: దృశ్యం2 ఓటీటీకే వస్తుందా? విడుదల ఎప్పుడు?

మలయాళ సినిమా దృశ్యం తెలుగులో పెద్ద హిట్. ఇప్పుడు దృశ్యం2 కూడా తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది.

Continues below advertisement

మలయాళంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన సినిమా దృశ్యం2. ఇప్పటికే అది ఓటీటీలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. దాన్ని కూడా తెలుగులో  దృశ్యం2 పేరుతోనే రీమేక్ చేశారు. ఇందులో కూడా వెంకటేష్, మీనా లీడ్ రోల్స్ చేశారు. కాగా ఇది చిత్రీకరణ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఈ సినిమాను మొన్నటి వరకు ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఓటీటీతో చేసుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుని మరీ థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తోందట చిత్ర యూనిట్. 

Continues below advertisement

ఇప్పటికే థియేటర్లు ఓపెన్ అయి సినిమాలు విడుదలవుతున్నాయి. కాబట్టి  దృశ్యం2 ను కూడా దసరాకు థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అక్టోబర్  13న విడుదల చేసే అవకాశం ఉందని టాక్. థియేటర్లు ఓపెన్ అయినప్పటి నుంచి ఒక్క పెద్దహీరో మూవీ కూడా విడుదల కాలేదు. 

ఆరేళ్ల క్రితం మలయాళంలో  దృశ్యం1 విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఆ సినిమాను తెలుగు, తమిళం, హిందీతో పాటూ మరికొన్ని భాషల్లో రీమేక్ అయ్యింది. అన్ని భాషల్లోనూ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.  ఇప్పుడు దృశ్యం2 కూడా అదే స్థాయిలో హిట్ కొట్టింది. మలయాళంలో ఈ సినిమాను థియేటర్లో కాదని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. తెలుగు దృశ్యం2ను కూడా ముందు ఓటీటీలోనే విడుదల చేయాలనుకున్నా... ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిన కారణంగా థియేటర్లోనే రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు మూవీ మేకర్స్. 

హిందీలో కూడా ఈ సినిమా రీమేక్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. మళయాళంలో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

Also read: ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి... వైద్యుడిని కలవండి

Also read: మీరు వాడే వంటనూనె మంచిదో, కల్తీదో తెలుసా? ఇలా చేస్తే ఇట్టే తెలిసిపోతోంది...

Also read: రోజుకో రెండు తమలపాకులు నమలండి... ఈ రోగాలు దరిచేరవు

Also read: చన్నీళ్లు లేదా వేణ్నీళ్లు... ఏ నీళ్లతో స్నానం చేస్తే బెటర్?

Also read: సోంపు నీళ్లతో బరువు తగ్గుతారా? నిజమేనా?

Also read: ఆ చాకోలెట్ వినాయకుడిని చివరికి ఏం చేస్తారంటే...?

Also read: ఆమె చదివింది ఎమ్మెస్సీ... చేసేది రోడ్లు ఊడ్చేపని

Continues below advertisement