రోజూ ఒక యాపిల్ తింటే వైద్యుడి అవసరం లేదంటారు... అలాగే రోజుకో రెండు తమలపాకులు నమిలినా వైద్యుడి అవసరం తక్కువే పడుతుందని కొన్ని ఆరోగ్య అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే మన పూర్వీకులు రోజూ తమలపాకుల్ని తినేవారంట. ఆధునిక కాలంలో మాత్రం వీటి ఉపయోగం చాలా తగ్గిపోయింది. అందులో దీన్ని పాన్ కింద లెక్కగట్టేస్తారు. అందుకే చాలా మంది దాని జోలికి కూడా పోరు. పొగాకు లేదా సున్నం, అరేకా గింజలు కలిపి తమలపాకులో చుట్టి నమిలితే పాన్ అవుతుంది. అవేవీ లేకుండా కేవలం తమలపాకు ఒక్కటి నమలండి చాలు... అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మేం ఇక్కడ తమలపాకు మాత్రమే నమలమని చెబుతున్నాం... పాన్ మాత్రం కాదు.
తమలపాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధకశక్తిని పెంచేందుకు ఈ విటమిన్ చాలా అవసరం. తమలపాకు తింటే విటమిన్ సి శరీరానికి అందుతుంది. అంతేకాదు ఇందులో కాల్షియం కూడా అధికంగా లభిస్తుంది. కాల్షియంలోపం ఉన్నవాళ్లు తమలపాకులో కాస్త సున్నం కలిపి తింటే పుష్కలంగా అందుతుంది. కానీ సున్నం రోజూ తినడం మంచిది కాదు. కనుక ఆకులకే పరిమితం అవ్వడం మంచిది.
బాలింతలు తమలపాకులో వక్క పెట్టి, చిటికెడు సున్నం వేసి బాగా నమిలి మింగితే ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల శరీరంలో వేడి పెరగకుండా ఉంటుంది. ఈ ఆకులో పీచుపదార్థం కూడా ఉంటుంది. కనుక జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. మానసిక
చంటి పిల్లలకు జలుబు చేసినప్పుడు తమలపాకు రసాన్ని పిండి, రెండు చుక్కల ఆ రసాన్ని పాలల్లో కలిపి తాగిస్తే మంచిది. ఈ మిశ్రమం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. పెద్దలు కూడా ఈ మిశ్రమాన్ని తాగొచ్చు.
తలనొప్పికి తమలపాకులు దివ్యౌషధంలా పనిచేస్తాయి. నుదుటిపై తమలపాకుల రసంతో మర్ధనా చేస్తే మంచిఫలితం ఉంటుంది.
డిప్రెషన్ వంటి మానసిక సమస్యల బారిన పడినవారు రోజూ తమలపాకులను తినడం అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు మానసిక వైద్య నిపుణులు.
కొందరిలో ఆకలి తగ్గిపోతుంది. దీనివల్ల సరిగా తినకపోతే పోషకాహారలోపం కలగవచ్చు. అలాంటి వారు రెండు తమలపాకులు నమిలితే ఆకటి పుడుతుంది.
Also read: ఇవి తినడానికీ ఓ టైముంది... ఎప్పుడు తినకూడదంటే...
Also read: గుడ్లు తిన్నాక... వీటిని తినకండి, తింటే ఏమవుతుందంటే...
Also read: వంటనూనె పసుపు రంగులో ఉందా? మంచిదో, కల్తీదో ఇలా తెలుసుకోండి